AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Comet 2023: ఆకాశంలో అరుదైన అద్భుతం.. 50 ఏళ్ల తర్వాత దర్శనమివ్వనున్న తోక చుక్క. తెలుగు వారికీ ఛాన్స్‌.

ఎన్నో రహస్యాలు, మరెన్నో వింతలకు నెలకు మన విశ్వం. విశ్వాంతరాళాల్లో మనిషిని ఆశ్చర్యానికి గురి చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఎంత తరచి చూసినా ఇంకా ఇంకా ... ఎన్నో వింతలు... తనలో నింపుకుని మనిషిని నిత్యం ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంటాయి. ఎప్పటికీ అర్థం కాని ఆ గగనవీధుల్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది...

Green Comet 2023: ఆకాశంలో అరుదైన అద్భుతం.. 50 ఏళ్ల తర్వాత దర్శనమివ్వనున్న తోక చుక్క. తెలుగు వారికీ ఛాన్స్‌.
Green Comet 2023
Narender Vaitla
|

Updated on: Jan 31, 2023 | 3:02 PM

Share

ఎన్నో రహస్యాలు, మరెన్నో వింతలకు నెలకు మన విశ్వం. విశ్వాంతరాళాల్లో మనిషిని ఆశ్చర్యానికి గురి చేసే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఎంత తరచి చూసినా ఇంకా ఇంకా … ఎన్నో వింతలు… తనలో నింపుకుని మనిషిని నిత్యం ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంటాయి. ఎప్పటికీ అర్థం కాని ఆ గగనవీధుల్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇదే ఇప్పుడు శాస్త్రవేత్తల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకటో రెండో కాదు…శతాబ్దాల నాటిదీ కాదు… వేల సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైన అద్భుతం… మళ్లీ ఇప్పుడు ఆకాశంలో ఆవిష్కృతం కాబోతోంది. వేల ఏళ్ల క్రితం గగనవీధుల్లో కనువిందుచేసిన తార మరోసారి తళుక్కుమని మెరిసి, మనల్ని మురిపించి, మైమరపించబోతోంది.

ఆకాశంలో కనువిందు చేయబోయే ఆ నక్షత్రం పేరే గ్రీన్‌ కొమెట్‌ తోక చుక్క. అయితే ఈ తోక చుక్కను చేసే అదృష్టం మనకు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానున్న ఈ అద్భుతం పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ వాసులకు ఈ అద్భుతాన్ని స్పష్టంగా చూసే అరుదైన అవకాశం లభించనుంది. విజయవాడ నగరానికి ఉత్తర దిక్కులో ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో ఈ తోక చుక్కను చూడవచ్చు.

ఈ ప్రత్యేకమైన తోక చుక్క మంచు యుగంలో 50 వేల సంవత్సరాల క్రితం కనిపించింది. ఇది భూమికి 42 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నక్షత్రం తోక అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సౌర వ్యవస్థలో 4.5 బిలియన్‌ సంవత్సరాల క్రితం ఈ తోక చుక్క ఆవిర్భవించింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆకాశంలో ఆవిష్కృతం కానుందని శాస్త్రవేత్తలు గత మార్చిలో కనుగొన్నారు. 50,000 ఏళ్ల అనంతరం ఇప్పుడు మరోసారి మనముందు ఈ అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని.

ఇవి కూడా చదవండి

అయితే కేవలం నాలుగు రోజులు మాత్రమే దీన్ని మనం చూసే అవకాశం ఉంటుందని అంతరిక్ష పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇది భూమికీ అంగారకుడికీ మధ్యలో గంటకి 2, లక్షల ఏడు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. చిన్న నగరమంతటి వ్యాసార్థం కలిగిన ఈ కొమెట్‌ తోక చుక్క గంటకి రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది. ఇది పూర్తిగా మంచుమయంగా మారి, చిక్కటి ఆర్గానిక్‌ మెటీరియల్‌తో నిండి ఉంటుంది. వాయువులతో నిండిన ఈ మంచుగోళం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అధిక వేడిమికి… ధూళిని, వాయువులను అత్యంత వెలుతురుతో కలిపి బయటకు వెదజల్లుతుంది. అందువల్లనే అవి తోకచుక్కల్లా కనిపిస్తాయి.

సౌరకుటుంబంలోని అనేక రహస్యాలను ఈ తోకచుక్కలు మనకు విప్పి చెపుతాయి. భూమిపై జీవావిష్కరణ ఎలా జరిగింది? అనేది కూడా తోకచుక్కల ద్వారా అర్థం చేసుకోవచ్చు. నిజానికి భూమి మీదకు జీవాన్ని తోకచుక్కలే మొసుకొచ్చాయని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. శతకోటి శతాబ్దాల చరిత గలిగిన ఈ కొమెట్‌ తోక చుక్క కొంగొత్త అందాలు దర్శించుకునేందుకు పరిశోధకులు, శాస్త్రవేత్తలు సహా, సామాన్యులు ఎదురుచూస్తున్నారు. ఆ అరుదైన తార అందాలను తనివి తీరా ఆస్వాదిద్దాం.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..