Trending Video: భంగ్రా డాన్స్‌తో అదరగొట్టిన బాలుడు.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో.. మీరూ చూసేయండి..

డ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. మనసుకు నచ్చిన మ్యూజిక్ వినిపిస్తే.. ఇక కాళ్లు ఊరుకుంటాయా. కథాకళి ఆడేయవు. చాలా మంది మ్యూజిక్ వినిపిస్తే డ్యాన్స్ చేసేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. మూమెంట్స్...

Trending Video: భంగ్రా డాన్స్‌తో అదరగొట్టిన బాలుడు.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో.. మీరూ చూసేయండి..
Boy Bhangra Dance
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 31, 2023 | 4:48 PM

డ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. మనసుకు నచ్చిన మ్యూజిక్ వినిపిస్తే.. ఇక కాళ్లు ఊరుకుంటాయా. కథాకళి ఆడేయవు. చాలా మంది మ్యూజిక్ వినిపిస్తే డ్యాన్స్ చేసేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. మూమెంట్స్ వచ్చినా రాకున్నా తమ స్టైల్ లో అలరిస్తుంటారు. అందుకే సోషల్ మీడియా నిండుగా డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పుడప్పుడు వైరల్ కూడా అవుతుంటాయి. ముఖ్యంగా ఒక్కో డ్యాన్స్ కు ఒక్కో రకమైన స్టైల్ ఉంటుంది. వాటిలో చాలా తేడాలు ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హుషారైన బీట్స్‌కు చిన్నారులు కాలు క‌దిపితే చూడముచ్చట‌గా ఉంటుంది. ఓ బాలుడు ఇచ్చిన భాంగ్రా డాన్స్‌ పెర్ఫామ‌న్స్ వీడియో తాజాగా నెట్టింట తెగ వైర‌లవుతోంది.

ఈ వీడియోలో హోటల్‌లో చిన్నపాటి ఫంక్షన్‌ ఏదో జరుగుతున్నట్టుంది. ఈ క్రమంలో ఓ బాలుడు పాపులర్‌ పాటకు అద్భుతంగా డాన్స్‌ చేశాడు. భాంగ్రా డాన్స్‌ చేస్తూ అక్కడ అందరినీ అలరించాడు. ఈ డ్యాన్స్ వీడియో ప‌లువురి ముఖాల‌పై న‌వ్వులు పూయించింది. హుషారైన డ్యాన్స్ మూమెంట్స్ ప్రద‌ర్శించిన చిన్నారిపై నెటిజ‌న్లు ప్రశంస‌లు గుప్పించారు. కాగా ఈ వీడియోను ఆ బాలుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఇప్పటికే ఈ వీడియోను 58 ల‌క్షల మంది వీక్షించారు. వేలల్లో లైక్‌ చేశారు. అంతేకాదు భిన్న రకాలుగా కామెంట్లు చేశారు. బాలుడి డ్యాన్స్ చూస్తుంటే త‌న‌కూ స్టెప్స్ వేయాల‌నిపించింద‌ని ఓ యూజ‌ర్ అంటే, అత‌డి పెర్ఫామెన్స్‌కు ఇక మాటల్లేవ్ అని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు. గాడ్ బ్లెస్ యూ బాబూ అని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ న్యూస్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..