Sleeping Bus: నిద్రపట్టడం లేదా? ఈ బస్ ఎక్కండి.. హాయిగా కునుకుతీయండి..!
Sleeping Bus: రోజంతా ఎంతో కష్టపడతాం.. దీంతో అలిసిపోయి రాత్రయితే చాలు హాయిగా నిద్రపోతాం. కానీ, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. పడక పై అటూ ఇటు దొర్లుతూ గడిపేస్తారే తప్ప కంటికి కునుకు పట్టదు.
Sleeping Bus: రోజంతా ఎంతో కష్టపడతాం.. దీంతో అలిసిపోయి రాత్రయితే చాలు హాయిగా నిద్రపోతాం. కానీ, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. పడక పై అటూ ఇటు దొర్లుతూ గడిపేస్తారే తప్ప కంటికి కునుకు పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.. చల్లగాలికి బస్సు వేగానికి వద్దన్నా నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన హాంకాంగ్‌లోని ఓ ట్రావెల్స్ సంస్థ ‘స్లీపింగ్ బస్’లను ప్రవేశపెట్టింది. ఇంట్లో పడకపై నిద్ర పట్టని వారు కూడా బస్సులో ప్రయాణిస్తూ హాయిగా నిద్రపోయినట్లు చెప్పడం విని, కొత్త ఐడియాను అమల్లో పెట్టినట్లు సంస్థ యజమాని తెలిపారు. ఈ బస్సులో ప్రయాణిస్తూ ఐదు గంటలపాటు నిద్రపోవచ్చు. హాంకాంగ్ పరిధిలో ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్ ఐదుగంటలపాటు 75 కి.మీ దూరం చక్కర్లు కొడుతుంది. ఓ గమ్యం అంటూ లేకుండా తిరుగుతూనే ఉంటుంది. చివరకు ఎక్కిన చోటే దించేస్తుంది. ఈ ఐదు గంటల పాటు ప్రయాణికులు హాయిగా నిద్రపోవచ్చు అని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. టికెట్ ధర అప్పర్ డెక్, లోయెర్ డెక్ ఇలా సీటు ఎంపికను బట్టి 13 డాలర్ల నుంచి 51 డాలర్ల వరకు ఉంటుందట.
ఇక నిద్ర కోసం బస్సు ఎక్కే ప్రయాణికులకు కళ్లకు పెట్టుకునే మాస్క్, గూడీ బ్యాగ్, బయటి శబ్దాలు వినిపించకుండా చెవులకు ఇయర్ ప్లగ్స్‌ను ఇస్తారు. కాగా.. ప్రయాణికులు తమకు అనువుగా ఉండేలా రాత్రి వేసుకునే దుస్తులు, బ్లాంకెట్లు కూడా తెచ్చుకోవచ్చు. హాంకాంగ్‌లో ఇటీవలే ఈ సేవల్ని ప్రారంభించగా.. సీట్లన్ని నిండిపోయాయట. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఉలూ ట్రావెల్స్ ఈ సేవల్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: