AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరకట్టును అవమానిస్తారా సిగ్గుచేటు.. రెస్టారెంట్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..

చీరకట్టు అనేది భారత సంప్రదాయం.. ఆడవారు చీరకట్టులో కనిపిస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. విదేశీలు కూడా మన చీరకట్టు సంప్రదాయానికి ముగ్ధులు అవుతుంటారు..

చీరకట్టును అవమానిస్తారా సిగ్గుచేటు.. రెస్టారెంట్ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2021 | 8:30 AM

Share

చీరకట్టు అనేది భారత సంప్రదాయం.. ఆడవారు చీరకట్టులో కనిపిస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. విదేశీలు కూడా మన చీరకట్టు సంప్రదాయానికి ముగ్ధులు అవుతుంటారు.. ఇతర దేశ స్త్రీలు కూడా చీర కట్టుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.. అలాంటిది ఇప్పుడు ఓ సంఘటన భారతీయులందరికి కోపం తెప్పిస్తుంది. చీరకట్టుకుంటే రెస్టారెంట్‌‌లోకి అనుమతి లేదని ఓ యాజమాన్యం రూల్ పెట్టడంతో ఇప్పుడు వివాదం రేగుతుంది. పోనీ అది వేరే దేశంలో కూడా కాదు మనదేశంలోనే ఇది జరగడం నిజంగా భారతీయులకు కట్టలు తెంచుకునే కోపాన్ని తెప్పిస్తుంది. దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్‌లో ఉన్న రెస్టారెంట్లో చీరకట్టులో వచ్చిన ఓ మహిళను రానీయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకరం రేపుతోంది. ఢిల్లీలోని అన్సల్ ప్లాజా అనే మాల్‌లోని రెస్టారెంట్‌కు ఓ మహిళ వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులతోపాటు అక్కడి మహిళా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.

రెస్టారెంట్‌లోకి చీరకట్టు అనుమతి లేదని ఆ మహిళను అడ్డుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో ఆమె సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరికి ఆమెను మాత్రంలోనికి అనుమతించలేదు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై నెటిజన్లంతా విరుచుకుపడుతున్నారు. చీరకట్టు మన సంకృతి.. దానిని అవమానించడం దారుణం.. చీరకు ఉన్న చరిత్ర తెలియని భారతీయులు…  సిగ్గుపడాల్సిన సంఘటన.. వెంటనే ఆ రెస్టారెంట్ ను మూసెయ్యాలి..చీర గొప్పదనం తెలియని మూర్ఖులు అంటూ మండిపడుతున్నారు.. వెంటనే ఆ రెస్టారెంట్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

America Vs China: చైనాకు నిద్ర లేకుండా చేస్తున్న అమెరికా ఆ రెండు నిర్ణయాలు.. ఎందుకో తెలుసా?

Covid-19 Kits: బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తున్న కోవిడ్ టెస్ట్ కిట్లు.. పక్కా సమాచారంతో పట్టుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు

Ram Gopal Varma: వరంగల్‌లో సీక్రెట్‌‌గా పర్యటిస్తున్న వర్మ.. అసలు కారణం అదేనా..