Covid-19 Kits: బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తున్న కోవిడ్ టెస్ట్ కిట్లు.. పక్కా సమాచారంతో పట్టుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు
కరోనా ప్రభావంతో ప్రపంచం అల్లాడుతోంది. ఇటు, తెలుగు రాష్ట్రాల్లో మూడో విడతలో అరంభం అయ్యినట్లుగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి., ఈ క్రమంలో రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి.
Covid-19 Kits Black Market: కరోనా ప్రభావంతో ప్రపంచం అల్లాడుతోంది. ఇటు, తెలుగు రాష్ట్రాల్లో మూడో విడతలో అరంభం అయ్యినట్లుగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి., ఈ క్రమంలో రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి. ‘బ్లాక్’ లో వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది భయపడుతుండటం, ఒకవేళ చేయించుకున్నా ట్రేసింగ్, వైద్య సిబ్బంది హడావుడితో నలుగురికి తెలిస్తే బాగుండదన్న భావనతో చాలామంది యాంటిజెన్ టెస్టులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కిట్లకు డిమాండ్ పెరిగి బ్లాక్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన అధికారులు అక్రమంగా తరలిస్తున్న కోవిడ్ నిర్ధారణ పరీక్షల కిట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ.47 లక్షల విలువ గల కోవిద్ కిట్లను సెబ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు AP 29 BU 5908 ఇటియస్ కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ కోవిద్ 19 కిట్లు రాయలసీమ లోని జిల్లాలకు సరఫరా చేసేందుకు హైదరాబాద్ కు చెందిన కిశోర్ తీసుకు వెళ్తున్నట్లు చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు పట్టుకున్నారు. కోవిడ్ కిట్లకు సంబందించిన బిల్లులు లేకపోవడంతో ఔషధ నియంత్రణ అధికారులకు సమాచారం ఇచ్చారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కేసు నమెదు చేసుకుని కిట్లను స్వాదీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న కిట్ల విలువ 47 లక్షల రుపాయలు ఉంటుందని డ్రగ్స్ కంట్రోల్ అధికారి చంద్రశేఖర్ రావు తెలిపారు.