Kamrunag lake: నదిలో కోట్ల విలువచేసే నిధి.. చేతి కందేలా ఉన్నా తీసుకోలేని పరిస్థితి! ఎక్కడంటే..

ఉత్తర భారతంలోని హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న మిస్టీరియస్‌ సరస్సు గురించి తెలిస్తే ఒక్క సారిగా షాక్‌ అవుతారు. ఎందుకంటే ఆ సర్సులో కోట్ల విలువ చేసే నిధి ఉన్న.. ఎటువంటి సెక్యురిటీ ఉండదు. ఐనా ఆ నిధిని ఎత్తుకెళ్లే సాహసం ఎవ్వరూ చెయ్యరు..

Kamrunag lake: నదిలో కోట్ల విలువచేసే నిధి.. చేతి కందేలా ఉన్నా తీసుకోలేని పరిస్థితి! ఎక్కడంటే..
Kamrunag Lake
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 02, 2022 | 9:14 PM

Trillions of treasure hidden in these mysteries lake: ఉత్తర భారతంలోని హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న మిస్టీరియస్‌ సరస్సు గురించి తెలిస్తే ఒక్క సారిగా షాక్‌ అవుతారు. ఎందుకంటే ఆ సర్సులో కోట్ల విలువ చేసే నిధి ఉన్న.. ఎటువంటి సెక్యురిటీ ఉండదు. ఐనా ఆ నిధిని ఎత్తుకెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు. ఎంతటి కరడుగట్టిన దొంగలైనా నిధివైపు కన్నెత్తైనా చూడరు. ఇదేదో కల్పిత కథ అని కొట్టిపారేయకండి..నిజంగానే ఉంది. అదెక్కడుందో..ఆ విశేషాలు మీకోసం..

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండీలోయలో ఉన్న మూడో ప్రధాన సరస్సుగా పేరుగాంచినది కమ్రునాగ్‌ సరస్సు (Kamrunag Lake). మండి జిల్లా నుంచి 60 కి.మీ దూరంలో రోహండా దట్టమైన అడవుల్లో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సులోనే కోట్ల విలువచేసే నిధి దాగి ఉంది. ఇక్కడ ఇంత నిధి ఉన్నప్పటికీ దానిని బయటకు తీయడానికి మాత్రం ఎవరూ ఎందుకు సాహసించరు.నిజానికి కమ్రునాగ్ సరస్సు ఒడ్డున ఓ ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోని బాబా కమ్రునాగ్‌ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఈ సరస్సులో బంగారు, వెండి, వజ్రాభరణాలు, డబ్బు వేయడమనే ఆచారం శతాబ్ధాలుగా సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. ఈ సంప్రదాయం మూలంగానే ఈ సరస్సులో బిలియన్ల నిధి పోగయ్యింది. అంతేకాకుండా ప్రతి యేటా జూన్ నెల 14-15 తేదీలలో ఇక్కడ ప్రత్యేక జాతర నిర్వహించబడుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఐతే ఈ సరస్సులో ఉన్న నిధి దేవతలకు చెందినదని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ నిధికి రక్షణగా ఓ పాము కూడా ఉందని, అదే అక్కడి నిధికి కాపలాగా ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. ఈ నిధిని ఎవరు బయటికి తీయాలని ప్రయత్నించినా పాము వాళ్ల ప్రాణాలను కభలిస్తుందనేది వాళ్ల నమ్మకం. అంతేకాకుండా ఈ సరస్సు నేరుగా పాతాళానికి వెళ్తుందని, అందుకే ఎవ్వరూ దీనిలోపలికి దిగే సాహసం చెయ్యరని చెబుతుంటారు. అక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు తీరాక మొక్కుబడులు చెల్లించుకోవడానికి వచ్చి, సరస్సులో బంగారు, వెండి ఆభరణాలను సమర్పించి వెళ్తుంటారు. ఇలా అక్కడ కోట్ల విలువచేసే నిధి పోగయ్యింది.

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?