AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగర్‌గా మారిన ధోనీ.. ఎంత బాగా పాడాడో..!

గత కొద్ది రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నధోనీ.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. తాను ఒక్క క్రికెటర్‌ మాత్రమే కాదు.. సింగర్‌ను కూడా అంటున్నాడు. ప్రపంచకప్ తర్వాత తాత్కాలికంగా క్రికెట్‌కు విరామం ఇచ్చిన ధోనీ.. సరదాగా ఇంటి సభ్యులతో కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనలో దాగి ఉన్న ఒక్కో కళ మెల్లిగా బయటపడుతున్నాయి. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో తన స్నేహితుడు ఓ పాట పాడుతుండగా.. ధోనీ కూడా తన […]

సింగర్‌గా మారిన ధోనీ.. ఎంత బాగా పాడాడో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 05, 2019 | 3:09 AM

Share

గత కొద్ది రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నధోనీ.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. తాను ఒక్క క్రికెటర్‌ మాత్రమే కాదు.. సింగర్‌ను కూడా అంటున్నాడు. ప్రపంచకప్ తర్వాత తాత్కాలికంగా క్రికెట్‌కు విరామం ఇచ్చిన ధోనీ.. సరదాగా ఇంటి సభ్యులతో కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనలో దాగి ఉన్న ఒక్కో కళ మెల్లిగా బయటపడుతున్నాయి. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో తన స్నేహితుడు ఓ పాట పాడుతుండగా.. ధోనీ కూడా తన స్నేహితుడితో గొంతు కలిపాడు. అది కూడా ఇప్పటి పాట కాదండోయ్.. 1990లో వచ్చిన బాలివుడ్ చిత్రం లోని పాట. జుర్మ్‌లో ‘జబ్‌ కోయ్‌ బాత్‌ బిగాద్‌ జయా’ పాటను తన స్నేహితుడు పాడుతుండగా.. ధోనీ కూడా గొంతు కలిపి పాడాడు. అయితే ఆ సమయంలో ధోనీ స్నేహితురాలు ప్రీతి.. ధోనీ పాడుతుండటాన్ని రికార్డు చేసి..తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు.. ఆ వీడియోకి ఓ కామెంట్ కూడా పెట్టింది. ‘‘వార్నింగ్ : ఈ వీడియో చూడటానికి ధైర్యం కావాలి. మహీకి ఎంతో టాలెంట్ ఉంది. మహీ.. ఈ వీడియో పోస్ట్‌ చేసినందుకు నన్నేమీ అనొద్దు. తప్పక షేర్‌ చేయాల్సి వచ్చింది’’ అంటూ ప్రీతీ పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన.. క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

View this post on Instagram

WARNING: PLS WATCH AT UR OWN RISK… The very talented Mr Mahi …? @mahi7781 pls dont kill me for postin dis one !!!?? But dis awaaz had to b shared !!??? @sakshisingh_r urs comin soon ! Duet singer : @anubhavdewan_ wah wah wah !!! Audience : me n #monusingh Thank god @sambhavdewan ur dad came to de rescue… Thanksss @__refulgence for an amazing night !!???

A post shared by Preeti Simoes (@preeti_simoes) on

కాగా, వరల్డ్ కప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. మళ్లీ తిరిగి మైదానంలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు ధోనీ. దీంతో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు రెడీ అవుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

Follow Us