AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ట్రంప్ హెయిర్‌స్టైల్’తో ఫేమస్ అయిన గేదెకు ప్రాణగండం.. చివరి నిమిషంలో భలే కాపాడారు!

బంగ్లాదేశ్‌లో ప్రత్యేకమైన బంగారు రంగు జుట్టుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన అరుదైన అల్బినో గేదెకు ప్రభుత్వం ప్రాణదానం చేసింది. “డొనాల్డ్ ట్రంప్”గా పేరుపొందిన ఈ గేదెను ఈద్ బలి కోసం విక్రయించినప్పటికీ, ప్రజల్లో పెరిగిన ఆసక్తి, భద్రతా కారణాలతో ప్రభుత్వం చివరి నిమిషంలో బలి నుంచి తప్పించి ఢాకా జాతీయ జూకు తరలించింది..

‘ట్రంప్ హెయిర్‌స్టైల్’తో ఫేమస్ అయిన గేదెకు ప్రాణగండం.. చివరి నిమిషంలో భలే కాపాడారు!
Donald Trump Buffalo Bangladesh
Srilakshmi C
|

Updated on: May 28, 2026 | 11:46 AM

Share

ధాకా, మే 28: బంగ్లాదేశ్‌లో ప్రత్యేకమైన బంగారు రంగు జుట్టుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన అరుదైన అల్బినో (తెల్లని రంగు) గేదెకు ప్రభుత్వం ప్రాణదానం చేసింది. అమెరికా అధ్యక్షడు ‘డొనాల్డ్ ట్రంప్’ రూపు రేఖలతో ఉన్న ఈ గేదెకు నెటిజన్లు ‘డొనాల్డ్ ట్రంప్ గేదె’ అని నామకరణం చేశారు. అయితే ట్రంప్‌ గేదెను ఈద్ బలి కోసం యజమాని వేరొకరికి విక్రయించాడు. గురువారం ఈద్‌ వేడుకలకు ముందే 700 కిలోల బరువున్న ఈ గేదెను వధ కోసం అప్పటికే విక్రయించారు. అయితే గేదెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఢాకా సమీపంలోని నారాయణ్‌గంజ్‌లో ఉన్న ఫారంకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని ఆ గేదెను చూడటానికి క్యూ కట్టారు. భద్రతాపరమైన ఆందోళనలు, ప్రజల్లో ఈ గెదకు ఉన్న పాపులారిటీ దృష్ట్యా చివరి అక్కడి ప్రభుత్వం చివరి నిమిషంలో బలి నుంచి గేదెను కాపాడింది.

బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ జోక్యం చేసుకుని గేదెను బలి నుంచి తప్పించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు చేసిన వ్యక్తికి డబ్బులు తిరిగి చెల్లించి, ఆ గేదెను ఢాకాలోని జాతీయ జూకు తరలించినట్లు వెల్లడించారు.

‘డొనాల్డ్ ట్రంప్’ పేరు ఎలా వచ్చింది?

ఈ గేదె తలపై ఉన్న బంగారు రంగు జుట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్‌ను పోలి ఉండటంతో ఫారం యజమాని జియౌద్దీన్ మృధా తమ్ముడు సరదాగా దానికి ట్రంప్‌ పేరు పెట్టాడు. అప్పటి నుంచి అదే పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాలుగేళ్ల వయసున్న ఈ అల్బినో గేదెను సుమారు పది నెలల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సాధారణ గేదెలతో పోలిస్తే దీనికి ప్రత్యేక సంరక్షణ అవసరమవుతుందని, తరచూ స్నానం చేయించడం, ప్రత్యేక ఆహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా ఈ గేదె చాలా శాంత స్వభావం కలిగినదని వివరించారు.

బంగ్లాదేశ్‌లోనే అరుదైన అల్బినో గేదెలు ఎందుకు ఉంటాయి?

బంగ్లాదేశ్‌లో సాధారణంగా గేదెలు నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. అల్బినిజం అనే జన్యుపరమైన పరిస్థితి కారణంగా కొన్నిసార్లు మాత్రమే ఇలాంటి తెల్లని గేదెలు పుడతాయి. శరీరంలో మెలానిన్ ఉత్పత్తి లేకపోవడంతో వీటి చర్మం తెలుపు లేదా పలుచని గులాబీ రంగులో కనిపిస్తుంది. దీని వింత రూపం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా నెట్టింట సెలబ్రెటీ అయింది. దీంతో ఈ గేదెను ప్రభుత్వం ప్రత్యేకంగా రక్షించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ గేదె ఢాకా జాతీయ జూలో ప్రభుత్వ సంరక్షణలో ఉంచారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us