AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వజ్రాలు పొదిగిన క్రిస్మస్‌ ట్రీ..చూసేందుకు రెండు కళ్ళూ చాలవు మరీ !

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి మొదలైంది. ఈ నెల 25న జరగబోయే క్రిస్మస్‌ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రిస్మస్‌ వేడుకల్లో ఎంతో విశిష్టత కలిగిన క్రిస్మస్‌ ట్రీ ఏర్పాటు. స్పెయిన్‌ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ‘ద కెంపిన్‌స్కి హోటల్ బాహియా’  క్రిస్మస్‌ చెట్టును వినూత్నంగా, భారీ వ్యయంతో ఏర్పాటు చేసింది. దీని పొడవు 16అడుగులు. సుమారు రూ.107.6కోట్ల (15 మిలియన్ డాలర్ల) విలువైన వజ్రాలతో దీన్ని అలంకరించారు. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇదే అత్యంత ఖరీదైన […]

వజ్రాలు పొదిగిన క్రిస్మస్‌ ట్రీ..చూసేందుకు రెండు కళ్ళూ చాలవు మరీ !
Anil kumar poka
|

Updated on: Dec 05, 2019 | 1:03 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి మొదలైంది. ఈ నెల 25న జరగబోయే క్రిస్మస్‌ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రిస్మస్‌ వేడుకల్లో ఎంతో విశిష్టత కలిగిన క్రిస్మస్‌ ట్రీ ఏర్పాటు. స్పెయిన్‌ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ‘ద కెంపిన్‌స్కి హోటల్ బాహియా’  క్రిస్మస్‌ చెట్టును వినూత్నంగా, భారీ వ్యయంతో ఏర్పాటు చేసింది. దీని పొడవు 16అడుగులు. సుమారు రూ.107.6కోట్ల (15 మిలియన్ డాలర్ల) విలువైన వజ్రాలతో దీన్ని అలంకరించారు. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇదే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ అని భావిస్తున్నారు. ఎరుపు, తెలుపు, గులాబీ రంగు వజ్రాలు పొదిగిన ఈ చెట్టు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.. వీటితో పాటు బల్గరీ, కార్టియార్, వాన్ క్లెఫ్, ఆర్పెల్స్, చానెల్, పెర్ఫ్యూమ్స్, ఆస్ట్రిచ్ గుడ్లు, నెమలి ఆకారంలో 3డీ ప్రింటెడ్ చాక్లెట్ వంటి ఆభరణాలతో చెట్టును అలంకరించారు. అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్లో 2010లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. దానిని నెక్లెస్‌లు, బ్రాస్ లెట్లు, వాచ్‌లతో అలంకరించారు. అప్పట్లో దాని ఖరీదు రూ.78కోట్ల 70లక్షల 42వేల 300(11మిలియన్ అమెరికన్ డాలర్లు).

Follow Us