Viral Video: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఉద్యోగం ఇదే.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు.
పెద్దదైనా, చిన్నదైనా ఉద్యోగం ఉంటే జీవితానికి భరోసా ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వ్యాపారంతో పోల్చితే ఉద్యోగానికే మొగ్గు చూపుతుంటారు. ఉద్యోగాలు ఆర్థికంగా భరోసా ఇస్తాయనే దాంట్లో కచ్చితంగా నిజం ఉంది. కానీ కొన్ని రకాల ఉద్యోగాలు మాత్రం ఆర్థికంగా భరోసానిచ్చినా, జీవితానికి మాత్రం ప్రమాదంలోకి నెట్టేస్తుంటాయి. అలాంటి ప్రమాదకరమైన...

పెద్దదైనా, చిన్నదైనా ఉద్యోగం ఉంటే జీవితానికి భరోసా ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వ్యాపారంతో పోల్చితే ఉద్యోగానికే మొగ్గు చూపుతుంటారు. ఉద్యోగాలు ఆర్థికంగా భరోసా ఇస్తాయనే దాంట్లో కచ్చితంగా నిజం ఉంది. కానీ కొన్ని రకాల ఉద్యోగాలు మాత్రం ఆర్థికంగా భరోసానిచ్చినా, జీవితానికి మాత్రం ప్రమాదంలోకి నెట్టేస్తుంటాయి. అలాంటి ప్రమాదకరమైన ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఉద్యోగానికి సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రాణాలను పణంగా పెట్టి మరీ చేసే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. నిజానికి వారు అలా ప్రాణాలకు తెగించి పని చేస్తేనే మన జీవితాలు సాఫీగా సాగుతాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోలో ఓ ఉద్యోగి చేస్తున్న పని చూస్తే షాక్ అవ్వక ఉండలేరు. కొండల నడుమ ఓ భారీ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఓవైపు మంచు కురుస్తోంది, మరో వైపు భూమికి వందల అడుగుల ఎత్తులో వైర్లు.. సదరు ఉద్యోగి ఆ విద్యుత్ వైర్లపైకి ఎక్కి రిపేర్ చేశాడు. దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.




Massive respect to all the workers out in this weather. This electrician’s job helping to restore power isn’t for the faint hearted. Esp when he needs to unbuckle for a few seconds ? pic.twitter.com/2l8BN3FQVA
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 30, 2022
దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. హౌ థింగ్స్ వర్క్ అనే ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయగా మిలియన్ల లైక్స్‌ను దక్కించుకోవడం విశేషం. ఇక ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఇదే ఉద్యోగంరా బాబు అంటూ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎంత కష్టమైనా తాము చేస్తున్న ఉద్యోగమే బెటర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఉద్యోగాలు చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌తో పాటు, గుండె ధైర్యం అనే అర్హత కూడా ఉండాలి కదూ!
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..