Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Bike: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ ధర కేవలం రూ.18,700లు మాత్రమే.. నెట్టింట వైరల్ అవుతున్న బిల్లు!

బుల్లెట్‌ బైక్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. యువతకే కాకుండా అన్ని వయసుల వారికి ఫేవరెట్ వెహికిల్ గా మారింది. ఎందుకంటే.. దానిపై కూర్చొని ప్రయాణం చేస్తే అదొక స్టేటస్‌ సింబల్‌ లా ఫీల్ అయి పోయేవాళ్లు...

Bullet Bike: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ ధర కేవలం రూ.18,700లు మాత్రమే.. నెట్టింట వైరల్ అవుతున్న బిల్లు!
Royal Enfield
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 01, 2023 | 1:23 PM

బుల్లెట్‌ బైక్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. యువతకే కాకుండా అన్ని వయసుల వారికి ఫేవరెట్ వెహికిల్ గా మారింది. ఎందుకంటే.. దానిపై కూర్చొని ప్రయాణం చేస్తే అదొక స్టేటస్‌ సింబల్‌ లా ఫీల్ అయి పోయేవాళ్లు చాలా మంది. ఒకప్పుడు బుల్లెట్‌ బండిపైన ఎవరైనా వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసేవారు.. అంతేకాదు వారిని చాలా గొప్పగా భావించేవాళ్లు. ఇప్పుడు ఈ బండిని అందరూ వాడుతున్నారనుకోండి. అప్పట్లో ఈ బండిని వాడేవారు అరుదుగా ఉండేవారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘ఆల్ న్యూ క్లాసిక్’ ఎక్స్ షో రూం ధర ఇప్పుడు 2 లక్షలు పైనే ఉంది. అంతేనా.. దీనికి బోల్డన్ని అదనపు ఖర్చులు కూడాను. కానీ ఒకప్పుడు ఈ బుల్లెట్‌ బైక్ ధర ఎంతో తెలుసా.. అచ్చంగా 18,700 రూపాయలు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఎందుకంటే అందుకు సాక్ష్యంగా ఈ బైక్‌కి సంబంధించిన బిల్లు ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసైనా మీరు నమ్మాల్సిందే..

అందులో 23 జనవరి 1986లో కొన్నట్టుగా ఉంది. ఆ బిల్లును చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. జార్ఖండ్‌లోని బొకారో స్టీల్ సిటీలో ఉన్న సందీప్ ఆటో కంపెనీ 36 సంవత్సరాల క్రితం ఈ బిల్లు జారీ చేసింది. దాంట్లో ఒక బుల్లెట్ అని రాసి ఉంది. ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం ఇండియన్ ఆర్మీ ఎక్కువగా ఉపయోగించేది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బిల్లుకు 53 వేలమందికి పైగా లైక్‌ చేశారు.

Royal Enfield Bike

Royal Enfield Bike

ఓ యూజర్ స్పందిస్తూ తన వద్ద 1984 నాటి మోడల్ ఉందని, దాని ధర కేవలం 16,100 రూపాయలు మాత్రమేనని పేర్కొన్నాడు. 38 సంవత్సరాలు అయినా ఇప్పటికీ అది తన వద్ద భద్రంగా ఉందని రాసుకొచ్చాడు. మరో యూజర్ స్పందిస్తూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు కనీసం 250 రూపాయల డిస్కౌంట్‌ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..