Trending Video: కవితకు అందని అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో.. నెటిజన్లను ఆకట్టకుంటున్న కన్న బిడ్డను కౌగిలించుకున్న కంగారు వైరల్ వీడియో..
ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కంగారూ తల్లి తన బిడ్డను కౌగిలించుకుంది. వీటిని చూసిన నెటిజన్ల గుండెలు కరిగిపోతున్నాయి.

ఈ ప్రపంచంలో బంధువులు ,మిత్రులందరి ప్రేమకంటే తల్లి ప్రేమ చాలాగొప్పది. తల్లి ప్రేమ గురించి ఎన్ని మాటల్లో చెప్పినా తక్కువే.. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా తల్లిప్రేమకు తిరుగుండదు. ఏదో సినిమాలో హీరో అన్నట్టుగా సృష్టిలో తల్లికి మించిన యోధులెవరూ లేరు. ఇది అక్షరాల నిజం. ఏదైన సమస్య ఉంటే తల్లి ఓదార్పు ఉంటే చాలు అంత కంటే పెద్దది మరొకటి ఉండదు. అచ్చు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే ఎంతటి వారికైన అమ్మ గుర్తొస్తుంది. ఇందులో మానవుల నుండి జంతువుల వరకు తల్లి అనంతమైన ప్రేమను చూసి నెటిజన్ల హృదయం కరిగిపోయింది. వీడియోలో, ఒక తల్లి కంగారు తన బిడ్డను ప్రేమగా కౌగిలించుకోవడం కనిపిస్తుంది.
వీరి ప్రేమ, ఆప్యాయత అందరి హృదయాలను గెలుచుకుంది. వీడియోను ఒకసారి చూసిన తర్వాత, వినియోగదారులు దాని నుంచి వారి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. అంతలా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తల్లి కంగారూను కౌగిలించుకున్న..
వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది. దీన్ని ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ చిన్న క్లిప్‌లో.. ఒక తల్లి కంగారు తన బిడ్డను కౌగిలించుకోవడం కనిపిస్తుంది. తల్లీ తన బిడ్డను ఇలా ఒకరినొకరు కౌగిలించుకోవడం చూడవచ్చు. తన బిడ్డను కౌగిలించుకున్నట్లుగా… ఈ వీడియోలో తల్లి ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది.
Most Precious ❤️
Credits- in the video #motherslove #wildlife pic.twitter.com/VO1CwdGjHE
— Supriya Sahu IAS (@supriyasahuias) December 30, 2022
నెటిజన్ల వీడియోను ఇష్టపడ్డారు
ప్రస్తుతానికి, షెల్లీ పియర్సన్ అనే ఫోటోగ్రాఫర్ ఈ వీడియోను తన కెమెరాలో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వార్తలు రాసే సమయానికి 140 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
అదే సమయంలో, క్లిప్‌ను చూసిన తర్వాత, ట్విట్టర్ వినియోగదారులు తమను తాము ఆపుకోలేకపోయారు. ఈ వీడియోను స్నేహితులతో పంచుకోవడం కనిపిస్తుంది. కామెంట్ చేస్తున్నారు. తల్లి ప్రేమ గొప్పదని.. అమ్మ ప్రేమను మించినది ప్రపంచం మరొకటి లేదని ..
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం