Viral Video: కుక్కను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ కష్టాలు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో చూస్తే మాత్రం మీరు పడి పడి నవ్వేస్తారు. ఓ కుక్క పిల్లను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ తెగ ట్రై చేసింది. మరీ ఆ కుక్కపిల్ల ఇంప్రెస్ అయ్యిందా లేదా అని చూసేద్దామా.
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని మాత్రం నవ్వులు పూయిస్తుంటాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోస్ హల్చల్ చేస్తుంటాయి. ఇటీవల కుక్క పిల్లలకు సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని భయం కలిగించేవిగా ఉన్నాయి. తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో చూస్తే మాత్రం మీరు పడి పడి నవ్వేస్తారు. ఓ కుక్క పిల్లను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ తెగ ట్రై చేసింది. మరీ ఆ కుక్కపిల్ల ఇంప్రెస్ అయ్యిందా లేదా అని చూసేద్దామా.
బ్యూటెంగేబిడెన్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు ఈ వీడియోను షేర్ చేస్తూ కుక్క పిల్లను ఆకట్టుకోలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతుండగా.. నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అందులో ఓ కుక్క నెలపై పడుకుని ఉండగా.. దాని ముందుకు వచ్చిన గొల్లభామ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తన రెండు కాళ్లతో దండం పెడుతు కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. నేను ఇంప్రెస్ అయ్యాను.. కానీ ఆ కుక్క కాలేదు. గొల్లభామ డ్యాన్స్ ఎలా నేర్చుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Dog is not impressed.. ? pic.twitter.com/YOFZuy8gcp
— Buitengebieden (@buitengebieden) September 17, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.