Viral Video: రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ఉడుత వీడియో.. వాటర్‌ బాటిల్‌తో నీళ్లు తాగుతూ మరోమారు నెట్‌లో హల్‌చల్‌

ఉడుత చేసిన పనితో సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇంతకు అసలు విషయం ఏంటంటే...ఆకలి, దాహం అనేది ప్రాణికోటి సమస్తానికి ఒకేలా ఉంటుంది. దాహం వేస్తే మనిషి అయినా, పశు పక్షాదులైన

Viral Video: రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ఉడుత వీడియో.. వాటర్‌ బాటిల్‌తో నీళ్లు తాగుతూ మరోమారు నెట్‌లో హల్‌చల్‌
Squirrel
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2022 | 6:45 PM

Viral Video: ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తుంటే.. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో ఓ ఉడుత హల్‌చల్‌ చేస్తోంది. అది చేసిన పనితో సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇంతకు అసలు విషయం ఏంటంటే…ఆకలి, దాహం అనేది ప్రాణికోటి సమస్తానికి ఒకేలా ఉంటుంది. దాహం వేస్తే మనిషి అయినా, పశు పక్షాదులైన గొంతు తడుపుకోవడానికి తహతహలాడుతారు. ఇక దాహం తీరాక హమ్మయ్య బతుకు జీవుడా అనుకుంటారు. పక్షులు, జంతువుల‌కు కొన్నిసార్లు నీళ్లు దొర‌క‌క అల్లాడిపోతుంటాయి.  అలాంటిదే దాహంతో అల్లాడుతున్న ఉడుత‌కు ఓ మ‌హిళ నీళ్లందించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఉడుత వాటిర్ బాటిల్‌తో నీళ్లు తాగ‌డం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంది.. మాన‌వ‌త్వం చాటిన ఆ మ‌హిళ‌పై నెటిజన్లు ప్ర‌శంస‌ల కురిపిస్తున్నారు.

ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇందులో ఉడుత దాహంతో ఉంటుంది. అది గ‌మ‌నించిన ఓ మ‌హిళ త‌న చేతిలో ఉన్న వాట‌ర్ బాటిల్‌తో నీళ్లు అందించింది. ఉడుత రెండు కాళ్లపై నిలబడి.. త‌న‌ ముంద‌టి కాళ్ల‌తో వాట‌ర్‌బాటిల్ ప‌ట్టుకుని నీళ్లు తాగింది. ఈ వీడియో నెటిజ‌న్ల హృద‌యాన్ని క‌దిలించింది. ఉడుత దాహం తీర్చినందుకు ఆమెను అంద‌రూ అభినందించారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు రికార్డ్‌ వ్యూస్‌ లభించాయి. మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌, వేల సంఖ్యలో రీ ట్విట్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. లక్షల సంఖ్యలో వచ్చిన లైకులతో పాత వీడియో మరోమారు నెట్టింట ఉడుత చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి