Viral Video : రాక్షస బల్లితో పుచ్చకాయను షేర్ చేసుకున్నాడు.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే
ముఖ్యంగా కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. పశువులు, పిల్లులతో పాటు సాలెపురుగులు, పాములు, సరీసృపాలు కూడా పెంచుకుంటూ ఉంటారు కొందరు.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే.. చాలా మంది ఇళ్లల్లో జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. పశువులు, పిల్లులతో పాటు సాలెపురుగులు, పాములు, సరీసృపాలు కూడా పెంచుకుంటూ ఉంటారు కొందరు. వీటికి సంబంధించిన వీడియోలు మనం చాలానే చూస్తుంటాం..పెంపుడు జంతువుతో చిరుతిండిని పంచుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? కొంతమంది తాము తినే ఆహారాన్ని పెంపుడు జంతువులతో పంచుకుంటూ ఉంటారు. ఈవీడియోలో ఒక వ్యక్తి కూడా తన పెంపుడు జంతువుతో ఆహారాన్ని షేర్ చేసుకున్నాడు. కానీ ఆ జంతువును చూడగానే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
ఇగువానా( రాక్షస బల్లి) తో ఓ వ్యక్తి పుచ్చకాయను పంచుకుని తిన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 6,29,000 మంది చూశారు. వందలాది మంది స్పందించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి జంతువును ఇంట్లో ఉంచడం సురక్షితమేనా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలాగే అలాంటి జంతువుతో ఆహారం పంచుకోవడం సరైందేనా? అనుకూడా ప్రశ్నలు సంధిస్తున్నారు . మరికొందరైతే ఈ మనిషికి ఇలాంటి వాటిని వదిలేసి కుక్కని, పిల్లిని పెంచుకోవచ్చుగా అని సలహాలు కూడా ఇస్తున్నారు. మరికొంతమంది జంతు ప్రేమికులు ఈ జంతువు అద్భుతంగా ఉందని. వీడియో చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి ఇష్టం వారిది.. ఏ జంతువును పెంచుకుంటున్నాం అన్నది కాదు.. దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం అన్నది ముఖ్యం. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sharing is caring.. ?
? IG: lizardthebuddy pic.twitter.com/mXUGWjbejl
— Buitengebieden (@buitengebieden) November 2, 2022
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..