Viral Video: మరణం అంచుల్లో ఉన్న తొండకు CPR ఇచ్చి రక్షించిన యువకుడు.. వీడియో వైరల్
కొందరు తమ వికృత చర్యలతో దారుణమైన మనసతత్వంతో తప్పుడు పనులతో ఇతరులను ఇబ్బంది పెట్టే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో కొందరు ఇతరులు కష్టపడుతుంటే చూసి.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడే మంచి మనసు కలిగి ఉన్నవారు ఉన్నారు. వీరి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చూస్తే మానవత్వం ఈ భూమి నుండి ఇంకా అంతరించిపోలేదని తెలుస్తుంది.

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని ప్రజలకు బాగా నచ్చుతాయి. వీటిల్లో కొన్ని వీడియోలు షాకింగ్‌గా ఉన్నా చాలాసార్లు అలాంటి వీడియోలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అవి చూస్తుంటే స్క్రోలింగ్ చేస్తున్న చేతులు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీకు కూడా అర్థం అవుతుంది భూమిపై మానవత్వం ఇంకా ఉందని.
ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో ప్రతి జీవికి బతికెందుకు హక్కు ఉంది. అయితే కొందరు తమ వికృత చర్యలతో దారుణమైన మనసతత్వంతో తప్పుడు పనులతో ఇతరులను ఇబ్బంది పెట్టే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో కొందరు ఇతరులు కష్టపడుతుంటే చూసి.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడే మంచి మనసు కలిగి ఉన్నవారు ఉన్నారు. వీరి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చూస్తే మానవత్వం ఈ భూమి నుండి ఇంకా అంతరించిపోలేదని తెలుస్తుంది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయినప్పుడు .. అతని శ్వాస ఆగిపోయినప్పుడు అతనికి వెంటనే CPR ఇవ్వబడుతుంది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కనిపించింది. నిజానికి ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి CPR ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి తొండ ప్రాణాలను కాపాడాడు.
ఇక్కడ వీడియో చూడండి
Ser bondadosos no nos cuesta nada. ❤ pic.twitter.com/ccdF6grEjt
— Eugenia Dinu (@DinuEugenia) October 9, 2023
వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో ఒక వ్యక్తి మరణం అంచుల వరకూ వెళ్లిన ఓ తొండ ను పొలంలో చూశాడు. వెంటనే దానిని చేతుల్లోకి తీసుకుని CPR ఇవ్వడం ద్వారాప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. అతను తన చేతులతో తొండ ఛాతీని బలమైన ఒత్తిడిని గురి చేస్తూ గాలిని పంప్ చేస్తూనే ఉన్నాడు. దీని తర్వాత యువకుడు తన నోటితో ఊపిరి పోయడానికి ప్రయత్నించాడు.. చివరికి యువకుడి శ్రమ ఫలించి తొండ ఎట్టకేలకు కళ్ళు తెరిచింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..