AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆలోచించా ఆశాభంగం.. బాత్ రూమ్‌ని బెడ్ రూమ్‌గా మార్చిన బెంగళూరు వాసులు.. నెలకు అద్దె..రూ.12..

ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అలాంటిదే ఒకటి వైరల్ అవుతోంది. ఆ గది..చూసి న తర్వాత దాని అద్దె  గురించి విన్న జనం అయోమయంలో పడ్డారు. విషయం ఏమిటంటే.. బెంగళూరులో ఓ వ్యక్తి అద్దె కోసం ఓ  ఇంటి కోసం వెతుకుతున్నాడు. అటువంటి పరిస్థితిలో అతను NoBrokerని ఆశ్రయించాడు. అప్పుడు ఓ ఇంటిని చూసినట్లు.. ఆ ఇంటికి సంబంధించిన ఓ ఫోటోను ఇంటర్నెట్‌లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ  విషయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Viral News: ఆలోచించా ఆశాభంగం.. బాత్ రూమ్‌ని బెడ్ రూమ్‌గా మార్చిన బెంగళూరు వాసులు.. నెలకు అద్దె..రూ.12..
Viral News
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 14, 2023 | 6:20 PM

అభివృద్ధి చెందిన నగరంల్లో, పట్టణాల్లో నివసించడం అంత సులభం కాదు. సుదూర గ్రామాల్లో నివసించే వారు నగరాల్లో సులభంగా ఉద్యోగాలు పొందగలరు. అయితే నగరాలకు వచ్చి నివసించడం చాలా కష్టం ఎందుకంటే నగరాల్లో ఇక్కడ ఇల్లు దొరికినా అద్దె ఎక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే.. కొంతమంది తాము ఉద్యోగం చేసి సంపాదించిన నెల జీతంలో సగం అద్దెగా చెల్లించే పరిస్థితులున్నాయి. మరోవైపు డబ్బు పొదుపు చేయాలనీ అనుకుంటూ ఆశతో తీసుకునే జీతం.. రూంలోకి అడుగు పెట్టగానే జీతం అంతా అయిపోయినట్లే అన్పిస్తుంది. ఎందుకంటే నగరాల్లో తమ శక్తికి మించిన అద్దె ఎక్కువ చెల్లించాల్సిన సందర్భాలు ఉన్నాయి  తాజాగా ఓ గదికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’ సినిమాలో రూమ్ కి సంబంధించి ఓ డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అలాంటిదే ఒకటి వైరల్ అవుతోంది. ఆ గది..చూసి న తర్వాత దాని అద్దె  గురించి విన్న జనం అయోమయంలో పడ్డారు. విషయం ఏమిటంటే.. బెంగళూరులో ఓ వ్యక్తి అద్దె కోసం ఓ  ఇంటి కోసం వెతుకుతున్నాడు. అటువంటి పరిస్థితిలో అతను NoBrokerని ఆశ్రయించాడు. అప్పుడు ఓ ఇంటిని చూసినట్లు.. ఆ ఇంటికి సంబంధించిన ఓ ఫోటోను ఇంటర్నెట్‌లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ  విషయం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నప్పుడు మహదేవ్‌పురాలో 1RK గది అద్దెకు ఖాళీగా ఉందని సమాచారం. ఇందులో ఒక మంచం మాత్రమే అతి కష్టమీద కస్టమర్స్ కు అందుబాటులో ఉంటుంది. దీని అద్దె నెలకు రూ.12 వేలు. ఇది కాకుండా  మీరు ఇక్కడకు వెళ్లడానికి ఆసక్తి కలిగి ఉంటే, మీరు 50k సెక్యూరిటీని కూడా డిపాజిట్ చేయాలి. ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలా మంది బెంగళూరుకు స్వాగతం పలికారు. మరొక వినియోగదారు  “ఇది బెడ్‌రూమ్‌గా మార్చబడిన టాయిలెట్.”అని కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..