AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Parliament: కొత్త పార్లమెంట్ హౌస్‌కు 6 గేట్లు.. ప్రతీ ద్వారంకు వివిధ జంతువుల పేర్లు.. వాటికి ఆ పేర్లను ఎందుకు పెట్టారో తెలుసా..

New Parliament House Gates: దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన కొత్త పార్లమెంట్​ భవనం సరికొత్త ఘట్టానికి వేదిక. ఈ భవన నిర్మాణం కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ భవవన నిర్మాణంలో ఎన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. ఈ భవన ద్వారాలకు కొన్ని పేర్లు పెట్టారు. ఆ పేర్లలో కూడా చాలా ప్రత్యేకతతోపాటు భారతీయత ఉట్టిపడేలా.. జంతువుల పేర్లను పెట్టారు.

New Parliament: కొత్త పార్లమెంట్ హౌస్‌కు 6 గేట్లు.. ప్రతీ ద్వారంకు వివిధ జంతువుల పేర్లు.. వాటికి ఆ పేర్లను ఎందుకు పెట్టారో తెలుసా..
New Parliament House
Sanjay Kasula
|

Updated on: Oct 12, 2023 | 9:55 AM

Share

కొత్త పార్లమెంట్ హౌస్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌లోని ఆరు గేట్లకు జంతువుల పేర్లు పెట్టారు. కొన్ని నిజమైనవి, కొన్ని పౌరాణికమైనవి. ఈ జంతువుల్లో ప్రతి ఒక్కటి 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్‌లోని వివిధ అంశాలను సూచిస్తుంది. ఆ అన్ని దారులకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం..

కొత్త పార్లమెంట్ భవనంలో జీవుల పేర్లతో ఆరు ద్వారాలు ఉన్నాయి. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం అనేవి ఆరు ద్వారాలు. ప్రతి ద్వారం దాని పేరు పెట్టబడిన జీవి శిల్పాన్ని మనం అక్కడ చూడవచ్చు. వాటిని ఎంతో అందంగా చెక్కిన శిల్పాలు కావడం విశేషం.

గజ ద్వారం

ఏనుగు పేరుతో గజ ద్వారం అని పేరు పెట్టారు, ఇది జ్ఞానం, జ్ఞాపకశక్తి, సంపద, తెలివితేటలను సూచిస్తుంది. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తర దిశ బుధుడికి సంబంధించినది. ఇది మేధస్సుకు మూలంగా పరిగణించబడుతుంది. గేట్లపై ఏనుగు బొమ్మలు సర్వసాధారణం. వాస్తు శాస్త్రం ప్రకారం.. అవి శ్రేయస్సు, సంతోషాన్ని కలిగిస్తాయి.

అశ్వ ద్వారం

గుర్రానికి అశ్వ ద్వార్ అని పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యం చిహ్నం.

గరుడ ద్వారం

మూడవ ద్వారానికి పక్షి రాజు గరుడ పేరు పెట్టారు. గరుడుడిని విష్ణువు వాహనంగా భావిస్తాం. త్రిమూర్తులలో రక్షకుడైన విష్ణువు వాహనం. గరుడ పక్షిని శక్తి, ధర్మానికి (కర్తవ్యం) చిహ్నంగా చూస్తాం. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించబడుతుందో కూడా వివరిస్తుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం.

మకర ద్వారం

మకరం అనేది సముద్ర జీవి పేరు పెట్టబడింది. శిల్పాలు దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించిన హిందూ- బౌద్ధ స్మారక కట్టడాలలో ఈ మకరం కినిపిస్తుంది. ఒక వైపు, మకర వివిధ జీవుల కలయికగా భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. మరోవైపు, ద్వారాల వద్ద మకర విగ్రహాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వైపుగా ఉంటుంది.

శార్దూల ద్వారం

ఐదవ ద్వారం మరొక పురాణ జీవి అయిన శార్దూల పేరు పెట్టబడింది. ఇది సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది.. కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం గేటు వద్ద శార్దూల ఉండటం దేశ ప్రజల బలానికి ప్రతీక అని ప్రభుత్వ నోట్‌లో పేర్కొన్నారు.

హంస ద్వారం

పార్లమెంటు ఆరవ ద్వారాన్ని హంస ద్వారంగా పేరు పెట్టారు. హంస అనేది సనాతన ధర్మంలో జ్ఞాన దేవత అయిన సరస్వతి దేవి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది లేదా జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న హంస విగ్రహం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం.

New Parliament House Gates

New Parliament House Gates

మరిన్ని జాతీయ వార్తల కోసం