- Telugu News Photo Gallery Political photos PM Modi offers prayers at Parvati Kund in Pithoragarh, Uttarakhand see photos
PM Modi In Uttarakhand: పార్వతీ కుండ్ వద్ద పరమశివుడికి ప్రత్యేక పూజలు.. ఆది కైలాశ్ పర్వతాన్ని దర్శించుకున్న తొలి ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం ఉత్తరాఖండ్ చేరుకున్నారు. పితౌరాగఢ్ జిల్లాలోని పార్వతీ కుండ్ దగ్గర పరమశివుడి దేవాలయాన్ని ప్రధాని సందర్శించారు. స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు. అనంతరం పరమశివుడు కొలువైన ఆది కైలాశ్ పర్వతాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామానికి కూడా వెళ్లారు.
Updated on: Oct 12, 2023 | 12:07 PM

ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పితౌరాగఢ్ జిల్లాలోని పార్వతీ కుండ్ దగ్గర పరమశివుడి దేవాలయాన్ని ప్రధాని సందర్శించారు.

స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు.

అనంతరం పరమశివుడు కొలువైన ఆది కైలాశ్ పర్వతాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామానికి కూడా వెళ్లారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లో ఒకరోజు పర్యటన నిమిత్తం ఇవాళ పితోర్‌గఢ్ చేరుకున్నారు. అక్కడ కైలాస శిఖరాన్ని దర్శించుకున్న తర్వాత పార్వతి కుండ్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్‌కు చేరుకున్న దేశానికి తొలి ప్రధాని నరేంద్ర మోదీయే కావడం విశేషం. భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న గుంజి గ్రామాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతోనూ సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సంప్రదాయ సంగీత వాయిద్యాలను కూడా వాయించారు. గ్రామస్తులు తయారు చేస్తున్న స్థానిక ఉత్పత్తులను ప్రధాని మోదీ ప్రశంసించారు.

ప్రధాని మోదీ ఈ పర్యటనలో రూ.4200 కోట్ల విలువైన పలు అభివృద్ధికార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఉత్తరాఖండ్ పర్యటనలో పార్వతి కుండ్‌లో పూజలు చేసిన ప్రధాని మోదీ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.




