- Telugu News Photo Gallery Political photos Telangana CM KCR AI Pictures goes Viral on Social Media, Have a Look Once
Telangana CM KCR: దుమ్ము రేపుతున్న కేసీఆర్… సోషల్ మీడియా నిండా ఆ ఫోటోలే..
Telangana CM KCR: ఈ మధ్య సోషల్ మీడియాలో కేసీఆర్ ఏఐ ఫోటోలో రచ్చ చేస్తున్నాయి. అభిమానులను ఆయనకు సంబంధించిన ఏఐ ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే, సాధారణ లుక్‌లో కేసీఆర్ అయితే, పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ స్టైలీష్ లుక్‌లో, మాస్ అండ్ క్లాస్ లీడర్ లుక్ అదరగొడుతున్నాయి ఫోటోలు.
Rakesh Reddy Ch | Edited By: TV9 Telugu
Updated on: Nov 07, 2023 | 4:19 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో కేసీఆర్ ఏఐ ఫోటోలో రచ్చ చేస్తున్నాయి. అభిమానులను ఆయనకు సంబంధించిన ఏఐ ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే, సాధారణ లుక్‌లో కేసీఆర్ అయితే, పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ స్టైలీష్ లుక్‌లో, మాస్ అండ్ క్లాస్ లీడర్ లుక్ అదరగొడుతున్నాయి ఫోటోలు.

స్టైలిష్ కళ్లజోడుతో సిక్స్ ప్యాక్ కెసిఆర్ కనిపిస్తున్నారు. రజినీకాంత్ స్టైల్‌లో.. అంబాసిడర్ కార్ బ్యాక్ గ్రౌండ్‌లో మరో ఫోటో వైరల్ అవుతోంది. కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ గ్రౌండ్లో ఒక ఫోటో, రోబో 3 లోడింగ్, కేసీఆర్ 3.0, కేసీఆర్ కిట్ అందజేస్తూ.. మత్స్యకారుల నుంచి చేపలు అందుకుంటూ ఇలా రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోలు చూసి కొంతమంది మాత్రం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ఫోటో షూట్ చేశారా? అని భావిస్తున్నారు. ఈ ఫోటోలన్నీ చూస్తుంటే కేసీఆర్ ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందంటున్నారు. అయితే, ఇవి ఫోటోషూట్ కాదు. ఫోటోషాప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్రియేట్ చేస్తున్న ఫోటోలు.

పనిలో పనిగా ఎలక్షన్ ప్రచారంతో పాటు, ప్రతిపక్షాలకు కౌంటర్లు కూడా ఈ ఫోటోలతోనే ఇస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నుంచి ఈ ఫోటోలన్నీ రిలీజ్ అవుతున్నాయి.

అంతేకాదు ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా కేసీఆర్ ఏఐ ఫోటోలు కనిపిస్తున్నాయి. చాలా కొత్తగా టక్ వేసుకొని, షూస్ తొడుక్కొని, సినిమా హీరో లా కనిపించేలా ఈ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు.

కేవలం కేసీఆర్ ఫోటోలు మాత్రమే కాదండోయ్. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కూడా ప్రతిభంబించేలా ఈ ఏఐ ఫోటోలను తయారు చేస్తున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఇంకా ఇలాంటి డిజిటల్ ప్రచారాలు ఊపందుకుంటాయి. ఒక ఫోటోలో కాలేశ్వరం, కాలేశ్వరం డ్యామ్‌పై కేసీఆర్ అని రాసి ఉన్న చిత్రం ఉండటం ఆసక్తిని కలుగజేసింది.





























