Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాస్తా లక్షాధికారిని చేసింది! ఒక వీడియో పోస్ట్ చేసి లక్ష సంపాదిస్తున్న యువకుడు

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రజలు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా మంచి మొత్తాన్ని సంపాదిస్తున్నారు. కొందరు వ్యక్తులు కేవలం ఒక పోస్టు ద్వారా రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారు. వారిలో అమెరికాకు చెందిన జియాన్‌లూకా కాంటె కూడా ఒకరు, కొన్నేళ్ల క్రితం పాస్తా తయారు చేయడం.. ఆ  వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించాడు. దాని కారణంగా అతను ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

Viral Video: పాస్తా లక్షాధికారిని చేసింది! ఒక వీడియో పోస్ట్ చేసి లక్ష సంపాదిస్తున్న యువకుడు
Food Influencer
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2023 | 10:35 AM

ధనవంతులు కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించాలని.. ధనవంతులు కావాలని కోరుకుంటారు. అందుకోసం తమ శక్తికి తగిన విధంగా కష్టపడుతూ.. ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. కష్టపడి పని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఒక్కసారిగా కోటీశ్వరులు, బిలియనీర్లు అయినవారు చాలా మంది ఉన్నారు. మరికొందరు నిదానంగా డబ్బులు సంపాదిస్తారు. అయితే పాస్తా తయారు చేస్తూ కోటీశ్వరులు అయ్యారని మీరు ఎప్పుడైనా విన్నారా? ఓ యువకుడు పాస్తా తయారు చేసి ధనవంతుడయ్యాడని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రజలు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా మంచి మొత్తాన్ని సంపాదిస్తున్నారు. కొందరు వ్యక్తులు కేవలం ఒక పోస్టు ద్వారా రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారు. వారిలో అమెరికాకు చెందిన జియాన్‌లూకా కాంటె కూడా ఒకరు, కొన్నేళ్ల క్రితం పాస్తా తయారు చేయడం.. ఆ  వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించాడు. దాని కారణంగా అతను ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by QCP (@itsqcp)

ప్రత్యేకమైన శైలిలో పాస్తా తయారీ

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం జియాన్లూకా 2019 సంవత్సరంలో టిక్‌టాక్‌లో తన మొదటి వీడియో షేర్ చేశాడు. అందులో అతను పాస్తా తయారు చేయడం చూపించాడు. అప్పుడు అతను కాలేజీలో చదువుకునేవాడు. అంతేకాదు తన తండ్రి రెస్టారెంట్‌లో కూడా పనిచేసేవాడు. వెల్లుల్లి, టొమాటోలను ఉపయోగించి పాస్తాను తయారు చేశానని.. దీనిని ఎవరైనా ఎంతగానో ఇష్టపడతారని చెప్పారు.  అనంతరం పాస్తా తయారీనే వృత్తిగా ఎంచుకున్నాడు. అతను విభిన్న స్టైల్స్‌లో పాస్తా తయారు చేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో వీడియోలను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వీడియోలు ప్రస్తుతం  మిలియన్ల వ్యూస్ ను పొందడం ప్రారంభించింది.

మోడలింగ్‌లోనూ సత్తా చాటుతున్న యువకుడు

నివేదికల ప్రకారం.. ఇప్పుడు అతనికి టిక్‌టాక్‌లో కోటి మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ అతని వీడియోలను చాలా ఇష్టపడతారు. జియాన్లూకా చాలా అందగాడు దీంతో మోడలింగ్ చేయడానికి ఆఫర్లను అందుకోవడం ప్రారంభించాడు. అనేక ప్రసిద్ధ బ్రాండ్లతో పని చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా కనీసం లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. అమ్మాయిలు కూడా తనని చాలా ఇష్టపడతారని.. సరసాలాడడానికి ప్రయత్నిస్తారని జియాన్లూకా చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..