ఆర్డర్ చేసిన ఫిష్ బిర్యానీ ఆబగా తినాలనుకున్నాడు.. తీరా ప్లేట్‌లో కనిపించిన వింత ఆకారాన్ని చూడగా!

అప్పుడప్పుడూ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్స్ చేస్తుంటే.. ఒకటికి బదులుగా మరొకటి రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా.. చికెన్ బిర్యానీ రావడం.. అలాగే ఇంకొకరు బర్గర్ ఆర్డర్ పెడితే.. బొండా రావడం లాంటి సంఘటనలు మనకు తెలిసినవే. అయితే తాజాగా ఈ కోవకు చెందిన..

ఆర్డర్ చేసిన ఫిష్ బిర్యానీ ఆబగా తినాలనుకున్నాడు.. తీరా ప్లేట్‌లో కనిపించిన వింత ఆకారాన్ని చూడగా!
Viral News
Follow us

|

Updated on: May 13, 2024 | 12:20 PM

అప్పుడప్పుడూ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్స్ చేస్తుంటే.. ఒకటికి బదులుగా మరొకటి రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా.. చికెన్ బిర్యానీ రావడం.. అలాగే ఇంకొకరు బర్గర్ ఆర్డర్ పెడితే.. బొండా రావడం లాంటి సంఘటనలు మనకు తెలిసినవే. అయితే తాజాగా ఈ కోవకు చెందిన ఓ సంఘటన ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది వింటే మీరు కూడా ఛీ.. ఛీ.. ఇంకెప్పుడూ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్ చేయమని కచ్చితంగా అంటారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే.. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేశాడు.

అయితే వచ్చిన పార్శిల్‌లో బిర్యానీతో పాటు అనేక కీటకాలు కూడా రావడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఆ చేపను కట్ చేసి చూడగా.. బూజుపట్టేసి.. పాడైపోయినట్టుగా ఉంది. అలాగే ఎన్నో కీటకాలు కూడా అందుల్కో ఉన్నాయి. ఇది సదరు వ్యక్తి వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ బిర్యానీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశానని, ఫుడ్ ఇచ్చిన హోటల్ తనను ఇలా మోసం చేసిందని ఆ వ్యక్తి తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. మిగిలినవారు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కాగా, ఈ షాకింగ్ వీడియోకు ఇప్పటిదాకా 7.8 మిలియన్ల వ్యూస్ రాగా.. 67 వేల మందికిపైగా దీన్ని లైక్ చేశారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.