Viral Video: నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ.. బైక్‌ను ట్రక్‌గా మార్చేశాడు.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
ఈ ప్రపంచంలో ప్రతిభకు కొదవలేదు. మరీ ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు అక్కర్లేని వస్తువులతో చేసే గొప్ప ఇన్వెన్షన్స్ చూపరులను విశేషంగా...
ఈ ప్రపంచంలో ప్రతిభకు కొదవలేదు. మరీ ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు అక్కర్లేని వస్తువులతో చేసే గొప్ప ఇన్వెన్షన్స్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి దేశీ ఇన్వెన్షన్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అసలు ఆ వీడియోలో మీరు బైక్‌ను చూస్తున్నారా.? లేదా ట్రక్కును చూస్తున్నారా.? అని తెలియక ఆలోచనలో పడతారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
The little engine that could. ??? pic.twitter.com/U5DtnXQdbX
— Fred Schultz (@fred035schultz) October 29, 2021
వైరల్ వీడియో ప్రకారం.. రోడ్డుపై ఓ వ్యక్తి బైక్ నడుపుతున్నట్లు మీరు చూడవచ్చు. కేవలం 11 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోలో అతడు బైక్‌తో పాటు ఓ ఫుల్ లోడెడ్ ట్రక్కును కూడా తీసుకెళ్తున్నట్లు మీకు అర్ధమవుతుంది. అసలు ఇదెలా సాధ్యమైందని మీకు అనిపించినా.. అతడు చేసిన క్రియేటివిటీకి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఈ ఫన్నీ వీడియోను ‘fred035schultz’ అనే నెటిజన్ షేర్ చేయగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆ వ్యక్తి తెలివికి జోహార్లు అని ఒకరు కామెంట్ చేయగా.. అసలు ఈ వీడియో మన దేశంలోనిదేనా అని మరొకరు అడిగారు.
Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??