AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అంత్యక్రియలు జరిగిన 13 రోజులకు అనూహ్య ఫోన్ కాల్.. ఆరా తీయగా ఊహించని ట్విస్ట్

చనిపోయి, అంత్యక్రియలు కూడా నిర్వహించిన తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తి ఇంటి ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి.. ఊహ కాదు నిజంగానే జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించిన ఒక కుటుంబం ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఆ వివరాలు..

Viral: అంత్యక్రియలు జరిగిన 13 రోజులకు అనూహ్య ఫోన్ కాల్.. ఆరా తీయగా ఊహించని ట్విస్ట్
Madhya Pradesh
Ravi Kiran
|

Updated on: Jun 13, 2024 | 8:41 AM

Share

చనిపోయి, అంత్యక్రియలు కూడా నిర్వహించిన తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తి ఇంటి ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి.. ఊహ కాదు నిజంగానే జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించిన ఒక కుటుంబం ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లా లహచోరా గ్రామానికి చెందిన సురేంద్ర శర్మ, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని క్లాత్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ సమీపంలోని సుర్వాల్‌లో గత నెలలో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గుర్తించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ వ్యక్తిని సురేంద్రగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. జైపూర్‌లోని ఆసుపత్రికి వారు తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో రాజస్థాన్‌ పోలీసులు పోస్ట్‌మార్టం తర్వాత ఆ వ్యక్తి మృతదేహాన్ని సురేంద్ర కుటుంబానికి అప్పగించారు. మే 28న అంత్యక్రియలు నిర్వహించారు.

13వ రోజున సురేంద్రకు దశ దిన కర్మలు చేసేందుకు అతడి కుటుంబం సిద్ధమైంది. అయితే ముందు రోజు సురేంద్ర నుంచి ఫోన్‌ వచ్చింది. విషయం నమ్మని సురేంద్ర సోదరుడు వీడియో కాల్‌ చేయాలని కోరాడు. అతడు వీడియో కాల్‌ చేయగా సురేంద్ర బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలుసుకుని షాక్‌ అయ్యారు. వెంటనే ఇంటికి తిరిగి రావాలని చెప్పారు. అలాగే 13 రోజున నిర్వహించాల్సిన కర్మకాండలను వాయిదా వేశారు. ఇంటికి తిరిగి వచ్చిన సురేంద్ర తన ఫోన్‌ పాడైందని తెలిపాడు. అందుకే రెండు నెలలుగా కుటుంబానికి ఫోన్‌ చేయలేదని చెప్పాడు. అయితే అతడు బతికే ఉన్నాడని రాజస్థాన్‌ పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తప్పుగా గుర్తించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సురేంద్ర కుటుంబంపై దర్యాప్తు చేపట్టారు.

ఇది చదవండి: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్