Viral: పాము చర్మాన్ని ఒలిచి.. కూర వండుకున్న యువకుడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
పాము చర్మం ఒలిచి, కూర వండుకుని తిన్న యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పాము చర్మాన్ని ఒలుస్తున్న వీడియో వైరల్ అవ్వడం.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

పాము చర్మం ఒలిచి, కూర వండుకుని తిన్న యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. పాము చర్మాన్ని ఒలుస్తున్న వీడియో వైరల్ అవ్వడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఆ స్టోరీ ఇలా ఉంది.
వివరాల్లోకెళ్తే.. తిరుపత్తూరు జిల్లాలోని పెరుమపట్టు ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాజేశ్ కుమార్ పాము చర్మాన్ని ఒలుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో జిల్లా అటవీశాఖ అధికారి మహేంద్రన్ ఆ వీడియాపై విచారణకు ఆదేశించారు. వీడియో ద్వారా రాజేశ్‌ను గుర్తించిన స్థానిక అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా రాజేశ్ పాము చర్మాన్ని ఒలిచి, కూర వండుకుని కూడా తిన్నట్లు తేలింది. దీంతో వన్య జంతు సంరక్షణ చట్టం కింద అతడిని అరెస్టు చేసి తిరుపత్తూరు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత జైలుకు తరలించారు.
పాము కాటుకు వ్యక్తి మృతి..
ఇదిలా ఉండగా.. ఒడిశాలో జరిగిన ఓ ఘటనలో పాము కాటుకు ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సింసారి ఠాణా పరిధిలో ఉన్న సింధిగాల్ గ్రామానికి చెందిన ధనిరామ్ బొత్ర (39)గా గుర్తించారు. ధనిరామ్ మంగళవారం రాత్రి భోజనం చేసి.. ఇంటి వరండాలో పడుకున్న ధనిరామ్‌ను.. బుధవారం తెల్లవారు జామున కింగ్ కోబ్రా కాటేసింది. అతని కేకలు విని కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అప్పటికే విషమించడంతో.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు ధనిరామ్
ఇది చదవండి: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
