Maaza Juice: ఎండలో చల్లగా మాజా జ్యూస్ తాగుదామని ఓపెన్‌ చెయ్యబోతే.. లోపల్నుంచి వింత శబ్ధాలు! ప్యాకెట్ కట్ చేసి చూడగా..

ఓ వ్యక్తి సమీపంలోని దుకాణానికి వెళ్లి మాజా జ్యూస్‌ ప్యాకెట్‌ కొన్నాడు. ఐతే ప్యాకెట్‌ లోపల నుంచి వింత శబ్దాలురావడంతో అనుమానం వచ్చి ఓపెన్ చేశాడు.. ఐతే కళ్లు బైర్లు కమ్మాయి. లోపలున్న అతిధిని చూసి షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన..

Maaza Juice: ఎండలో చల్లగా మాజా జ్యూస్ తాగుదామని ఓపెన్‌ చెయ్యబోతే.. లోపల్నుంచి వింత శబ్ధాలు! ప్యాకెట్ కట్ చేసి చూడగా..
Maaza Juice
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 16, 2023 | 9:15 AM

మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానియాలు సేవించడం షరా మామూలే. కొబ్బరి బోండాలు, కూల్‌ డ్రింక్‌లు.. ఇలా తమకు అందుబాటులో ఉన్న వాటిని తాగి వేసవి తాపాన్ని పోగొట్టుకుంటుంటారు. తాజాగా ఓ వ్యక్తి సమీపంలోని దుకాణానికి వెళ్లి మాజా జ్యూస్‌ ప్యాకెట్‌ కొన్నాడు. ఐతే ప్యాకెట్‌ లోపల నుంచి వింత శబ్దాలురావడంతో అనుమానం వచ్చి ఓపెన్ చేశాడు.. అంతే కళ్లు బైర్లు కమ్మాయి. లోపలున్న అతిధిని చూసి షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లా దుంగార్ పూర్ ప్రాంతానికి చెందిన పూజ్ పూర్‌లో ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి స్థానికంగా ఉన్న షాపులో మాజా మామిడి రసం, కూల్ డ్రింక్‌లు కొనుగోలు చేశాడు. మాజా ప్యాకెట్ ఓపెన్ చేసి, తాగుదామనుకునేలోపు లోపలినుంచి ఏదో శబ్దం వచ్చింది. వెంటనే దాన్ని ఓపెన్ చేయకుండా షాపు యజమాని వద్దకు తీసుకెళ్లాడు. షాపు యజమానితోనే మాజా ప్యాకెట్‌ను కట్ చేసి, జ్యూస్‌ను ఓ ప్లేట్‌లో పోశాడు. జ్యూస్‌లో బతికున్న జెర్రీ కనిపించింది. జెర్రీ జ్యూస్ ప్యాకెట్‌లోని ఎలా వెళ్లిందో అర్థం కావట్లేదని షాప్ యజమాని తెల్లమొఖం వేశాడు. దీన్నంతటిని సదరు యువకుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్‌లలో పురుగులు, పాములు, ఇతర చనిపోయిన జీవుల అవశేషాలు కనిపించేవి. తాజాగా రూ.10ల మాజా జ్యూస్‌లో బతికున్న పురుగు కనిపించడంతో అందరు ఆందోళన చెందుతున్నారు. శీతాల పానీయాలు, తిను బండారాలు, కూల్‌ డ్రింక్స్‌ తాగేముందు అలెర్ట్‌గా ఉండమని నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ