Viral Video: ఇదేందిరా.. ఇది.. రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేశాడు కానీ సీన్ రివర్స్ అయ్యింది..

కొంతమంది మంచి కవితతో ప్రపోజ్ చేస్తారు.. మరికొంతమంది లవ్ లెటర్ తో అమ్మాయిలను పడేస్తుంటారు.. ఇంకొంత మంది సింపుల్ గా రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటారు.

Viral Video: ఇదేందిరా.. ఇది.. రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేశాడు కానీ సీన్ రివర్స్ అయ్యింది..
Trending
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2023 | 9:42 AM

ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ప్రేమకు వయసుండదు ఏ వయసులోనైనా ప్రేమ పుడుతుంది. ప్రేమను ఒకొక్కరు ఒకొక్కలా వ్యక్తపరుస్తూ ఉంటారు. కొంతమంది మంచి కవితతో ప్రపోజ్ చేస్తారు.. మరికొంతమంది లవ్ లెటర్ తో అమ్మాయిలను పడేస్తుంటారు.. ఇంకొంత మంది సింపుల్ గా రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటారు. తాజాగా అలంటి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ విద్యార్థి ఓ అమ్మాయికి క్లాస్ లోనే లవ్ ప్రపోజ్ చేశాడు. కానీ అప్పుడే ఉంచించని షాక్ తగిలింది. ఇంతకు ఏమందంటే..

ఓ క్లాస్ లో అందరు ఉండగా ఓ అబ్బాయి అమ్మాయికి పువ్వుతో ప్రపోజ్ చేశాడు. తన చేతిలో దాచుకున్న గులాబీని అమ్మాయి ముందు పట్టుకుని ఆ అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అలా గులాబీని బయటకు తీయగానే ఆ అమ్మాయి అవాక్ అయింది.

గులాబీని చూడగానే  ఆ అమ్మాయి అతనిపై కోపంతో గులాబీని నేలపై విసిరింది. దాంతో అబ్బాయికి కోపం వస్తుంది. ఆ బాలికను కొట్టేందుకు ప్రయత్నించాడు. అయినా ఆ అమ్మాయి తగ్గలేదు.. కోపంతో బ్యాగ్‌ని చేతిలోకి అతడి పై దాడికి ప్రయత్నించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.