AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వల్ల చనిపోయాడనుకున్నారు.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఇంటికి రావడంతో అందరూ షాక్

కరోనా వల్ల చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి మళ్లీ  రెండేళ్ల తర్వాత  తిరిగి ఇంటికి  రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా కొడాద్‌కాలన్ గ్రామంలో చోటుచేసుకుంది.

కరోనా వల్ల చనిపోయాడనుకున్నారు.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఇంటికి రావడంతో అందరూ షాక్
Kamalesh
Aravind B
|

Updated on: Apr 16, 2023 | 6:56 AM

Share

కరోనా వల్ల చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి మళ్లీ  రెండేళ్ల తర్వాత  తిరిగి ఇంటికి  రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా కొడాద్‌కాలన్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 2021 జూన్ లో కమలేష్ అనే వ్యక్తి కొవిడ్ బారిన పడటంతో గుజరాత్ లోని బరోడాలో ఓ ఆసుపత్రిలో చేరాడు. అతను చికిత్స తీసుకుంటుండగానే కమలేష్ చనిపోయాడని వైద్యులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం.. కమలేష్ కుటుంబ సభ్యులకు గుడ్డతో కప్పబడి ఉన్న అతని మృతదేహాన్ని దూరం నుంచి చూపించారు. వాళ్లు దగ్గరికి వెళ్లి ఆ మృతదేహాన్ని చూడనప్పటికి వైద్యుల సలహా మేరకు అతను కమలేష్ అని కుటుంబ సభ్యులు అంగీకరించారు. అనంతరం వైద్యులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. చివరికి కమలేష్ చనిపోయాడనే మరణ ధృవీకరణ పత్రం కూడా ఇచ్చారు.

కమలేష్ చనిపోయాడనుకుని అతని నాన్న ఈరోజు వరకు ఆ షాక్ నుంచి కోలుకోలేదు. అతని భార్య దాదాపు 2 సంవత్సరాలు విధవరాలిగా ఉంది. వాస్తవానికి కొవిడ్ బృందం ద్వారా అంత్రయక్రియలు చేయబడిన ఆ మృతదేహాం కమలేష్‌ది కాదు. దాదాపు రెండేళ్ల తర్వాత కమలేష్ మధ్యప్రదేశ్ లో ఉన్న తన మామయ్య ఇంటికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా తన మామయ్య కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని కమలేష్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేవు. కమలేష్ మామ ఫోన్ లో వీడియో కాల్ చేసి వాళ్లతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

అయితే కమలేష్ మళ్లీ ఎలా రాగలిగాడనే ప్రశ్న అడగగా.. తాను కరోనా నుంచి కోలుకున్నాక ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని తెలిపాడు. అహ్మదాబాద్ కి తీసుకెళ్లి అక్కడ తనను నిర్భందించి టార్చర్ చేశారని, మత్తు మందు ఇంజెక్షన్లు ఇచ్చేవారని చెప్పాడు. అయితే శుక్రవారం రోజున అహ్మదాబాద్ నుంచి ఆ గ్యాంగ్ తనను కార్లో వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారని..ఓ ప్రాంతంలోని స్నాక్స్ కోసం హోటల్ వద్ద వాహనాన్ని ఆపారన్నాడు. అహ్మదాబాద్ నుంచి ఇండోర్ వరకు వెళ్తు్న్న బస్సును చూసి.. వెంటనే కారు దిగి దాన్ని ఎక్కేశానని తెలిపాడు. ఆ తర్వాత రాత్రికి మధ్యప్రదేశ్ లోని సర్దార్‌పూర్ లో దిగానని..అనంతరం ఇతరులు సహాయంతో తన మామయ్య ఇంటికి వచ్చేశానని చెప్పాడు. ఎట్టకేలకు కమలేష్ ప్రాణాలతో మళ్లీ ఇంటికి రావడంతో అతని కుటుంబ సభ్యులందరు భావోద్వేగానికి గురయ్యారు.