Video Viral: ఈ బుడ్డోడు మాములోడు కాదు.. ఏకంగా పుష్పరాజ్నే మించిపోయాడు.. వీడియో వైరల్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సృష్టించిన సెన్సేషన్ గురించి తెలిసిందే. గతేడాది డిసెంబర్ నెలలో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సృష్టించిన సెన్సేషన్ గురించి తెలిసిందే. గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డ్ సృష్టించింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఓటీటీలోనూ, టీవీల్లోనూ ప్రసారమైంది. అయితే పుష్పరాజ్ ఫీవర్ మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే పుష్ప పాటలకు సామాన్యులే కాకుండా.. సెలబ్రెటీలు.. క్రికెటర్స్.. స్టెప్పులేసి అదరగొట్టారు. ఇక పుష్ప రాజ్ మేనరిజంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పుష్పరాజ్ డైలాగ్స్.. అతని స్టైల్.. ఆటిట్యూడ్ను ఫాలో అవుతూనే ఉన్నారు. తాజాగా ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా పుష్పరాజ్నే మించిపోయేలా నటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
టీవీలో పుష్ప సినిమా వస్తున్న సమయంలో ఓ చిన్నోడు.. టీవీకి దగ్గరగా నిలబడి చూస్తున్నడు. ఆకస్మాత్తుగా పుష్ప రాజ్ స్టైల్లో ఎడమవైపు భూజాన్ని పైకెత్తు నడుస్తూ వెళ్లాడు.. ఈ చిన్నోడు పుష్ప రాజ్ మేనరిజాన్ని ఎంతో అందంగా ఫాలో అయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.. ఈ చిన్నారి వీడియో చూసిన నెటిజన్స్.. సో క్యూట్.. అదిరిపోయింది.. నెక్ట్స్ పుష్పరాజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..