Viral Video: చిరుత వేట మాములుగా ఉండదు.. జింకను ఎలా వేటాడిందో చూస్తే షాకవుతారు.!
Leopard Viral Video: సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. జంతువుల వీడియోలపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు..
చిరుత వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా చిరుతలు తమ ఎరను ఎంతో ప్రమాదకరంగా వేటాడతాయి. అవి ఎంచుకున్న జంతువులు తమ కనుచూపు మేర నుంచి తప్పించుకోకుండా.. రెప్పపాటులో వాయువేగంతో వాటిని వెంటాడి వేటాడటాయి.
చిరుత వేటాడే క్రమంలో వ్యూహాన్ని, వేగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది. చిరుతలు ఎంత స్పీడ్‌గా పరిగెత్తుతాయో అందరికీ తెలిసిందే. ఎరను పట్టుకునేటప్పుడు వాటి వేగాన్ని మూడు స్ట్రైక్స్‌లో కంట్రోల్ చేస్తాయట. వింటుంటే కొంచెం కొత్తగా ఉంది కదూ.. అయితే ఈ వీడియో చూడండి.. చిరుత ఎంత వేగంతో ఓ జింకను వేటాడిందో.. చివరికి ఆ వేగాన్ని ఎలా కంట్రోల్ చేసిందో మీకే తెలుస్తుంది.
సింగిల్‌గా దొరికిన జింకపై చిరుత వేటకు దిగుతుంది. ఆ వీడియోలో మీరు చూడవచ్చు. వేటాడే క్రమంలో చిరుత వేగాన్ని అమలు చేస్తూ దాని వెనుక పరుగెత్తుతుంది. ఇంకేముంది ఈ పోరాటంలో చిరుత గెలవడం ఖాయం. అది అందరికీ తెలిసిందే. చిరుతలు తమ ఎరను పట్టుకునేటప్పుడు.. వాటి మెడ భాగాన్ని పదునైన పళ్లతో కరుస్తాయి. అలా ఐదు నిమిషాలు కరిస్తే.. అవి చనిపోతాయి. కాగా, చిరుత వేటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని వేగాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
ఇవి చదవండి:
View this post on Instagram