Viral Photo: నిటారు కొండపైకి ఎక్కిన చిరుత.. సీన్ మాములుగా ఉండదు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Leopard Viral Photo: జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తారు...
జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తారు. ఇక ఆ లిస్టులో కొన్నింటిని చూసిన తర్వాత మన కళ్లను మనమే నమ్మలేం. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువులలో చిరుతలు కూడా ఒకటి. ప్రదేశం ఏదైనా కూడా చిరుత వేట భయానకంగా ఉంటుంది. ప్రదేశాలను పట్టించుకోకుండా చిరుతలు తమ వేటను కొనసాగిస్తుంటాయి. అటవీ ప్రాంతం.. పర్వతాలు.. కొండలు ఇలా ఎక్కడైనా కూడా చిరుతలు ఈజీగా తమ ఎరను వేటాడటాయి.
వైరల్ అవుతున్న ఫోటోలో, మీరు ఊహించలేని విధంగా నిటారుగా ఉన్న కొండపై చిరుత ఎక్కడం చూడవచ్చు. తన ఎర కోసం చిరుత వెతుకుతున్నట్లు మీకు అనిపిస్తుంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్ ప్రకారం, ఈ ఫోటోలో ప్రాంతం రాజస్థాన్‌లోని చంబల్ అని తెలుస్తోంది.
ఇక దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకుల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ ఫోటోను మనీష్ హరిప్రసాద్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అప్‌లోడ్ చేసిన క్షణాల్లోనే ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా 1.6k లైకులు రాగా, నెటిజన్లు రీ-ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.
#LeopardsOfChambal and the incredible landscape they live in. The walls of this gorge stand at 90 degrees, and according to the local fishermen, the leopards often push their prey tumbling down these cliffs to kill them. A bit like snow leopards in Ladakh.#IndiAves #Leopards pic.twitter.com/XCEE2Behtm
— Manish Hariprasad (@manishariprasad) September 18, 2021
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!