Viral Video: రాను రానంటూనే చిన్నదో పాటకు స్టెప్పులేసిన తల్లి కూతుర్లు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
అలాగే మన సినిమాలోని పాటలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల పుష్ప సినిమా పాటలు ఒక రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇటీవల మన తెలుగు సినిమాల రేంజ్ దేశాలు దాటి పోతుంది. మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వడమే కాకుండా అన్ని చోట్ల మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే మన సినిమాలోని పాటలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల పుష్ప సినిమా పాటలు ఒక రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. పుష్ప పాటలను భాషలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ డాన్స్ లు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి హల్ చల్ చేశాయి. ఇక అలాగే నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమాలోని రాను రానంటూనే చిన్నదో పాట కూడా ఒకటి. తాజాగా ఈ పాటకు కొరియా లో తల్లి కూతుర్లు అదిరిపోయే స్టెప్పులులేశారు. వీరిద్దరూ కొరియన్ సంప్రదాయ వస్త్రధారణలో అద్భుతంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి అత్యుత్సాహం చూసి నెటిజన్లు భలే అంటున్నారు.
కొరియన్ ప్యాలెస్ బయట ఇద్దరూ డ్యాన్స్ చేశారు. కూతురు గులాబీ రంగు హాన్‌బ్యాక్‌ను ధరించగా, తల్లి నీలం రంగు హాన్‌బ్యాక్‌ను ధరించారు. నితిన్ రా రా రెడ్డి, ఐ యామ్ రెడీ అనే పాటకు వీరిద్దరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఈ ప్రపంచం ఎంత చీకటిగా ఉన్నా, ప్రేమ దానిని జయిస్తుంది, ఎల్లప్పుడూ ప్రేమ! అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను 72,000 మందికి పైగా చూశారు. చాలా మంది స్పందించారు. కొంతమంది నువ్వు నా మాతృభాష పాటకు డ్యాన్స్ చేశావు.. నాకు చాలా సంతోషంగా ఉంది..అని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..