Lying Down Competition: ఏ పని చేయకుండ తిని పడుకుంటే చాలు డబ్బులు ఇస్తారు.. ఎక్కడంటే..
ఇక్కడ ఏ పనిచేయకుండా తిని పడుకుంటే డబ్బులు ఇస్తారు. కానీ దాదాపు 60 గంటలపాటు పడుకోవాలి. ది మిర్రర్ ప్రకారం దేశంలోని 2వ అతిపెద్ద
ప్రపంచంలోనే అనేక విచిత్రమైన పోటీలు నిర్వహిస్తుంటారు. ఇటీవల చాలా చోట్ల ఇలాంచి విచిత్రపోటీలు జరుగుతుంటాయి. గంటలపాటు నిద్రపోవడం..ఎక్కువగా తినేయడం.. పరిగెత్తడం.. నెమ్మదిగా నడవడం వంటి పోటీల గురించి తెలిసిందే. కానీ ప్రతి ఏడాది మోంటెనెగ్రోలో జరిగే పోటీ మాత్రం కాస్త విచిత్రం. ఇక్కడ ఏ పనిచేయకుండా తిని పడుకుంటే డబ్బులు ఇస్తారు. కానీ దాదాపు 60 గంటలపాటు పడుకోవాలి. ది మిర్రర్ ప్రకారం దేశంలోని 2వ అతిపెద్ద నగరం నిక్సిక్ వెలుపల ఉన్న బ్రెజ్నాలోని మోంటెనెగ్రోలో నిర్వహించబడిన ఈ విచిత్రమైన ఛాలెంజ్ ఉంది.దానినే లైయిగ్ డౌన్ కాంపిటేషన్ అంటారు. ఇందులో పాల్గొన్న జర్కో పెజనోవిక్ 12వ ఛాంపియన్ గా నిలిచాడు.
దాదాపు 60 గంటలపాటు పడుకుని బహుమతి గెలుచుకున్నాడు. నగదుతోపాటు ఇద్దరికి రెస్టారెంట్లో భోజనం.. ఓ ప్రత్యేక గ్రామంలో వీకెండ్ స్టే, రివర్ రాప్టింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. పోటీలో గెలిచిన అనంతరం జర్కో మాట్లాడుతూ.. తాను ఈ పోటికి ఎలాంటి నగదు చెల్లించలేదని.. ఈ ఛాలెంజ్ చేయడం సులభమే అని.. కానీ కుటుంబసభ్యులు వచ్చినప్పుడు లేవకుండా ఉండడం చాలా కష్టమని తెలిపాడు. ఈ పోటీలలో 9 మంది పాల్గోనగా.. మొదటి రోజు ముగిసే సమయానికి వారిలో 7గురు డ్రాప్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత జర్కో తనతోపాటు మరో పార్టిసిపెంట్ కోల్జెన్సిక్ తో కలిసి పాల్గోన్నాడు. వీరిలో జర్కో పెజనోవిచ్ విజేతగా నిలిచాడు. 60 గంటలకు పైగా నేలపై పడుకున్నందుకు జర్కో కు .. రూ. 27,885 గెలిచాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.