పాకిస్తాన్‌లో బంగారం ధర ఎంతో తెలుసా.? మన దేశంతో పోలిస్తే అక్కడ రేట్లు చాలా డిఫెరెంట్ గురూ!

భారతదేశంలో బంగారం ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి...

పాకిస్తాన్‌లో బంగారం ధర ఎంతో తెలుసా.? మన దేశంతో పోలిస్తే అక్కడ రేట్లు చాలా డిఫెరెంట్ గురూ!
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 06, 2021 | 1:33 PM

భారతదేశంలో బంగారం ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అయితే బంగారం ధరలు రికార్డు స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దాయాది దేశమైన పాకిస్తాన్‌లో బంగారం ధరలు ఎంత ఉంటాయోనని ఎప్పుడైనా ఆలోచించారా.? అక్కడ రేట్లు భారత్ కంటే పూర్తి భిన్నంగా ఉంటాయి. తులం బంగారం కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. అసలు పాకిస్తాన్‌లో బంగారం ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్తాన్‌లో కూడా నాణ్యత(Carat) ఆధారంగా బంగారం ధరలు నిర్ణయించబడతాయి ఈ జాబితాలో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు ఉన్నాయి. అలాగే ఈ దేశంలో బంగారం ధరలు తులం, గ్రాము, 10 గ్రాముల ఆధారంగా కూడా అలాగే, పాకిస్తాన్‌లో, బంగారం ధరలను తోలా, గ్రాము మరియు 10 గ్రాముల ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే వాస్తవానికి ఇక్కడ ఒక తులం ధర 10 గ్రాముల బంగారం ధర కంటే ఎక్కువ ఉంటుంది.

పాకిస్థాన్‌కు చెందిన డైలీ న్యూస్ వెబ్‌సైట్ ప్రకారం, బరువు ఆధారంగా మాట్లాడుకుంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.16 లక్షల పాకిస్తానీ రూపాయలకు దగ్గరగా ఉంది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం తులం ఆధారంగా విక్రయించబడుతోంది. సుమారుగా రూ. 1,06,333 పాకిస్తానీ రూపాయలు పలుకుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,450 పాకిస్థానీ రూపాయలు కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,162 రూపాయలుగా ఉంది. అటు ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9945 పాకిస్తానీ రూపాయలు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 9116 పాకిస్తానీ రూపాయలుగా ఉంది. ఇక ఇండియన్ కరెన్సీ.. 1 రూపాయి- 2.29 పాకిస్తానీ రూపాయలకు సమానం అని తెలిసిందే.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??