AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Beggar: ప్రపంచంలోనే అత్యంత ధనిక బిచ్చగాడు ఇతనేనట.. ఆస్తుల విలువ తెలిస్తే..

సాధారణంగా బిచ్చగాళ్ల దగ్గర ఎంత డబ్బులు ఉంటాయంటే మీరు ఏమనుకుంటారు.. మా అంటే 5 వేలు 10 వేలు అనుకుంటారు. కానీ ఇక్కడో బిచ్చగాడి గురించి తెలిస్తే మీరు వెంనటే మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే అతను ప్రపంచంలోనే అందరికంటే రిచ్చెస్ట్ బిచ్చగాడు. దేశంలో పెద్ద పెద్ద బిజినెస్‌ మ్యాన్స్, విద్యావేత్తల కంటే ఇతనే ఎక్కవ సంపాధిస్తాడట. ఇంతకు అతని ఆస్తుల విలువ ఎంతనేగా మీ డౌట్ తెలుసుకుందాం పదండి.

Richest Beggar: ప్రపంచంలోనే అత్యంత ధనిక బిచ్చగాడు ఇతనేనట.. ఆస్తుల విలువ తెలిస్తే..
World's Richest Beggar
Anand T
|

Updated on: Nov 28, 2025 | 3:36 PM

Share

భరత్ జైన్ అనే ఇతను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత దనవంతుడిగా పిలువబడుతున్నారు. ఇతను ముంబైలోని ఆజాద్ మైదాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో నివసిస్తుంటాడట. అయితే ఇతను గత 25 ఏళ్లుగా బిక్షాలటన చేస్తూ కొట్ల రూపాయాలు సంపాధించాట. ఇతనికి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రూ.7.5 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయట. ఇతను ఇక నెలలో చాలా మంది వ్యాపారవేత్తలు, ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాధిస్తాడట.

జైన్‌ నెలకు ఎంత సంపాధిస్తాడు?

చిన్న వయసులోనే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న భరత్ జైన్.. దీంతో విద్యకు దూరమై జీవితాన్ని నెట్టుకొచ్చేందుకు బిక్షాటన మొదలు పెట్టాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇతను సంపాధించిన డబ్బుతో వాళ్ల ఫ్యామిలీనికి మంచి జీవితాన్ని అందించాడు. ఇతను బిక్షాటన చేస్తూ రోజుకూ రూ.2 వేల నుంచి రూ. 2.500, నెలకు రూ.60 నుంచి 75 వేల వరకు సంపాధిస్తాడు. ప్రతస్తుం ఇతనికి ఉన్న ఆస్తుల నికర విలువ సుమారు రూ. 7.5 కోట్లుగా ఉన్నట్టు తెలస్తోంది.

జైన్‌కు ముంబైలో ఉన్న ఆస్తుల విలువ ఎంత?

అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే జైన్ తన జీవనోపాధి కోసం భిక్షాటన చేయడంతో పాటు.. వచ్చిన డబ్బును పెట్టుబడులుగా పెట్టి.. దాని ద్వారా కూడా సంపదను సృష్టించగలిగాడు. ఇలా సంపాధించిన డబ్బుతో జైన్ ముంబైలో రూ.1.4 కోట్ల విలువైన రెండు అపార్ట్‌మెంట్ల, థానేలో రెండు దుకాణాలు కొన్నాడు. వాటిని రెంట్‌కు ఇచ్చి వాటి నుంచి ప్రతి నెల రూ.30 వేలు సంపాధిస్తున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us