Kisan Credit Cards: కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇకపై వారికి కూడా..

Kisan Credit Cards-PM Modi: రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లో బలికావొద్దనే ఉద్దేశ్యంతో, రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని..

Kisan Credit Cards: కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇకపై వారికి కూడా..
Kisan Credit Card
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 25, 2021 | 5:36 PM

Kisan Credit Cards-PM Modi: రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లో బలికావొద్దనే ఉద్దేశ్యంతో, రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. అయితే, ఈ కార్డు విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ధాన్యం, పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఈ కార్డును వర్తింపజేస్తుండగా.. తాజాగా దీని పరిధిని విస్తృతం చేస్తూ నిర్ణయ తీసుకున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను మత్స్యకారులకు కూడా వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ వెల్లడించారు. మత్స్యకారులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను వర్తింపజేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.

ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి మురుగన్.. ‘‘ప్రభుత్వం ఇప్పటికే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేస్తోంది. ఇప్పుడు ఈ కార్డును పరిధిని విస్తృతం చేయాలని భావిస్తున్నాం. మత్స్యకారులకు కూడా ఈ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. త్వరలోనే మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేస్తాం. తద్వారా మత్స్యకారులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు పొందుతారు.’’ అని చెప్పుకొచ్చారు.

అలాగే.. సీ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతులను పెంచే లక్ష్యంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాదు.. కేంద్రం మరో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తోందన్నారు. సీ వీడ్ కల్టివేషన్(సముద్రపు పాచి) ను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా సీవీడ్ యూనిట్లను ఏర్పాటుు చేయబోతున్నామని, ఇందుకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఔషధ గుణాలు కలిగిన సీవీడ్‌కు భారతదేశంతో సహా విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉందని కేంద్ర మంత్రి వివరించారు. మత్స్యకారుల సాధికారతకు సీవీడ్ కల్టివేషన్ ఉపకరిస్తుందని పేర్కొన్నారు.

Also read:

IND vs PAK: ‘వారికి అనుకూలంగా ట్వీట్లు చేస్తావా.. నీపై కేసులు పడతాం’: భారత మాజీ ఓపెనర్‌పై నెటిజన్ల ట్రోల్స్

Sacred Heart School: టీవీ9 చొరవ.. నెరవేరిన వందలాది మంది విద్యార్థుల కోరిక

Vizag Live Video: విశాఖలో టెన్షన్..టెన్షన్.. ప్రభత్వ పాఠశాల మెసివేతపై విద్యార్థుల ధర్న.. (లైవ్ వీడియో)