AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్కూటీలోంచి వింత శబ్ధాలు.. ఏంటోనని చూడగా దిమ్మతిరిగే షాక్.. వణికిస్తున్న వీడియో..

అసలే వర్షాకాలం.. ఈ సమయంలో పాములు, పురుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అందుకే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం మంచిది. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

Viral Video: స్కూటీలోంచి వింత శబ్ధాలు.. ఏంటోనని చూడగా దిమ్మతిరిగే షాక్.. వణికిస్తున్న వీడియో..
Snake In Scooty
Shaik Madar Saheb
|

Updated on: Sep 18, 2022 | 5:36 PM

Share

Cobra Viral Video: అసలే వర్షాకాలం.. ఈ సమయంలో పాములు, పురుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అందుకే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం మంచిది. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల్లో మనం కొంచెం ఏమరపాటుతో ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌‌చల్ చేస్తోంది. ఓ స్కూటీలోనుంచి శబ్దాలు వస్తుండగా.. చెక్ చేశారు. దీంతో బుసలు కొడుతూ కింగ్ కోబ్రా బయటకు వచ్చింది. సాధారణంగా పాములు చాలా విషపూరితమైన, ప్రమాదకరమైన జీవులు. అటువంటి పరిస్థితిలో వారికి దూరంగా ఉండటం మంచిది. ఇటీవల వైరల్‌గా మారిన వీడియోను చూస్తే.. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రతిచోటా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం ఎంత ముఖ్యమో అంచనా వేయవచ్చు. చిన్నపాటి అజాగ్రత్త ప్రాణాలను బలిగొంటుంది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో స్కూటీలో ఉన్న కింగ్ కోబ్రా అందరికీ అదే సందేశమిస్తోంది.

దాదాపు రెండు నిమిషాల ఈ వైరల్ వీడియో అందరిని అలర్ట్ చేస్తోంది. ఈ గగుర్పాటు కలిగించే వీడియోలో స్కూటీ హ్యాండిల్‌లో ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఎలా మాటువేసి కూర్చుని ఉందో చూడవచ్చు. హ్యాండిల్ కదిలించిన వెంటనే అది బుసలు కొడుతూ పడగ విప్పింది. పామును పట్టుకున్న వ్యక్తి దానిని వాటర్ బాటిల్‌లో బంధించి, తరువాత దానిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మళ్లీ వైరల్ అవుతోంది. దీనిని IFS సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. వీడియోను షేర్ చేస్తూ.. వర్షంలో ఇలాంటి అతిథులు సర్వసాధారణం, కానీ వాటిని సేవ్ చేయడానికి ఉపయోగించే పద్ధతి అసాధారణమైనది.. కావున ఎప్పుడూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ సూచించారు. ఈ వీడియోను ఇప్పటివరకు 31 వేలకు పైగా వీక్షించారు. వెయ్యి మందికి పైగా లైక్ చేసారు. అంతేకాకుండా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..