AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌.. స్కూటర్‌లోకి ఎలా వెళ్లావ్‌ బాస్! టీచరమ్మ గుండె ధైర్యం గట్టిదే..

Venomous Snake Inside scooter in Kerala, Travel 5 kilometers: ఆమడ దూరంలో పాము కనిపిస్తేనే చాలా మంది భయంతో పరుగు లంకించుకుంటారు. అలాంటిది విషపూరితమైన పెద్ద పాము మీ పక్కనే, లేదంటే మీరు కూర్చున్న సీటు కిందనే ఉంటే ఏం చేస్తారు. ఊహకే వెన్నులో వణుకు పుడుతుంది కదూ.. ఓ మహిళ నిజంగానే భయంకరమైన విష సర్పంతో స్కూటిపై 5 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది...

బాబోయ్‌.. స్కూటర్‌లోకి ఎలా వెళ్లావ్‌ బాస్! టీచరమ్మ గుండె ధైర్యం గట్టిదే..
Venomous Snake Inside Scooter In Kerala
Srilakshmi C
|

Updated on: Nov 02, 2025 | 8:57 AM

Share

ఆమడ దూరంలో పాము కనిపిస్తేనే చాలా మంది భయంతో పరుగు లంకించుకుంటారు. అలాంటిది విషపూరితమైన పెద్ద పాము మీ పక్కనే, లేదంటే మీరు కూర్చున్న సీటు కిందనే ఉంటే ఏం చేస్తారు. ఊహకే వెన్నులో వణుకు పుడుతుంది కదూ.. ఓ మహిళ నిజంగానే భయంకరమైన విష సర్పంతో స్కూటిపై 5 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. తన స్కూటర్​లో విషపూరిత పాము ఉందనే విషయం తెలియకుండానే ఆమె ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిందో కాలేజీ​ టీచరమ్మ​. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి హానీ కలగకుండానే ప్రాణాలతో బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని కాసర్​గోడ్​ జిల్లాలో అక్టోబర్‌ 30 (గురువారం) జరిగింది. అసలేం జరిగిందంటే..

కేరళలోని తైకదప్పురానికి చెందిన షర్ఫునిసా అనే మహిళ నెహ్రూ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఆమె రోజు తన స్కూటర్‌పై కాలేజీకి వెళ్తుంటుంది. రోజూలాగే ఉదయాన్ని కాలేజీకి బయల్దేరింది. హెల్మెట్‌ పాటు షూలను చెక్ చేసుకుని స్కూటర్‌పై కాలేజీకి బయలుదేరింది. అలా రోడ్డుపై 5 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత బ్రేక్​ పెడల్​ దగ్గర ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే స్కూటీని రోడ్డు పక్కన ఆపుజేసి కిందకు దిగి కాస్త నిశితంగా పరిశీలించింది. అంతే గుండె ఆగినంత పనైంది. తన స్కూటీలో పెద్ద సైజులో ఓ విషపూరితమైన పాము కనిపించింది. దానిని చూసిన ఆమె ఒక్కసారిగా పరేషానైంది. తాను కొద్దిగా చేతులను కదిలించినా పాము కాటు వేసేదని, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయపడినట్లు వెల్లడించింది.

అయితే పామును స్కూటర్‌ నుంచి బయటకు తీసేందుకు షర్ఫునిసాకు ధైర్యం సరిపోలేదు. పైగా అది ట్రాఫిక్‌ అధికంగా ఉండే స్థలం కావడంతో తాను ఏ మాత్రం భయపడినా పెద్ద ప్రమాదమే జరిగేది. దీంతో కాస్త ధైర్యాన్ని కూడబెట్టుకుని మెల్లగా ఎలాగోలా కాలేజీ వరకు వెళ్లింది. వెంటనే దగ్గర్లోని మెకానిక్‌కు కాల్ చేసి స్కూటర్​ భాగాలను విప్పించడంతో.. అందులోని విషపూరిత పాము బయటకు వచ్చింది. అంతపెద్ద పామును చూసిన అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. తన అదృష్టం బాగుండి బతికిపోయానని, లేదంటే ఏం జరిగేదో ఊహించలేనని తన అనుభవాన్ని తెలిపింది. పామును బయటకు తీసిన తర్వాతనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పానని షర్ఫునిసా తెలిపింది.​ కాగా చలికాలం సమీపిస్తున్న క్రమంలో వెచ్చదనం కోసం కోబ్రా, రక్తపింజర వంటి విషపూరిత పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పైగా అక్టోబర్​ నుంచి జనవరి వరకు పాములు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి ఇల్లు, పరిసరాలు మాత్రమే కాకుండా షూలు, వాహనాలు కూడా పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?