లక్ష మంది వాడిన టాయిలెట్ సీటు వేలం! ఛీ.. అనకండి.. అసలు కథ తెలిస్తే నేనే కొంటా అంటారు!
101 కిలోల బంగారంతో చేసిన 'అమెరికా' టాయిలెట్ ఇప్పుడు Sotheby's వేలంలో ఉంది. మౌరిజియో కాటెలాన్ రూపొందించిన ఈ కళాఖండం 83 కోట్ల రూపాయలతో బిడ్డింగ్ ప్రారంభించనుంది. ధనిక, పేదల మధ్య వ్యత్యాసాన్ని చూపడమే దీని ఉద్దేశ్యం. గతంలో 1 లక్ష మంది వాడిన ఈ టాయిలెట్, 2019లో దొంగిలించబడింది.

ఎంతో ప్రత్యేకమైన, పురాతన వస్తువుల వేలం గురించి వినే ఉంటారు. అయితే ఓ టాయిలెట్‌ను తాజాగా వేలం వేయనున్నారు. ఆ టాయిలెట్‌ను ఏకంగా లక్ష మంది వాడారు. ఛీ అంత మంది వాడిన దాన్ని వేలం వేస్తే ఎవరు కొంటారు అని అనుకోకండి. అది మామూలు టాయిలెట్ కాదు.. బంగారంతో చేసిన టాయిలెట్. ఏకంగా 101 కిలోల బరువు ఉంటుంది. లండన్‌లో తయారు చేసిన విలువైన బంగారు టాయిలెట్ సీటు వేలం వేయబడుతోంది. ఈ సీటును ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ సృష్టించాడు. ఈ టాయిలెట్ సీటుకు అమెరికా అని పేరు పెట్టారు.
బిడ్డింగ్ 83 కోట్లతో షురూ..
ఈ బంగారు టాయిలెట్‌ను న్యూయార్క్‌లోని సోథెబీస్‌లో వేలం వేయనున్నారు. ఈ టాయిలెట్ సీటు కోసం బిడ్డింగ్ 10 మిలియన్ డాలర్ల నుండి ప్రారంభమవుతుంది, అంటే దాదాపు రూ.83 కోట్లు. ఈ టాయిలెట్ ధనవంతుడైనా, పేదవాడైనా, బంగారం అయినా, మట్టి అయినా, గొప్పలు చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని సందేశం పంపుతుందని మౌరిజియో కాటెలాన్ అన్నారు. టాయిలెట్ సీటు ఉద్దేశ్యం ఒకటే. సమాజంలో ధనవంతులు, పేదల మధ్య వ్యత్యాసాన్ని బయటకు తెచ్చే కళాఖండం ఇది.
101 కిలోల బంగారం..
ప్రపంచంలోనే ఈ ప్రత్యేకమైన టాయిలెట్‌ను తయారు చేయడానికి దాదాపు 101 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఈ టాయిలెట్ ప్రదర్శన కోసం మాత్రమే కాదు, ఉపయోగించవచ్చు కూడా. 2019 లో, బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ఇలాంటి టాయిలెట్‌ను ఉంచారు, కానీ అది దొంగిలించబడింది. అంతకుముందు 2016లో ఈ టాయిలెట్‌ను గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో ఉపయోగించడానికి ఉంచారు. 1 లక్ష మందికి పైగా దీనిని ఉపయోగించారు. వైట్ హౌస్‌లో అలాంటి టాయిలెట్‌ను ఏర్పాటు చేయమని డోనాల్డ్ ట్రంప్‌కు ఆఫర్ వచ్చింది, కానీ ట్రంప్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
