AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ ఆఫర్.. ప్రెగ్నెంట్ చేస్తే రూ.25 లక్షలు.. దెబ్బకు టెంప్ట్ అయిన కాంట్రాక్టర్.. చివరకు..

నన్ను ప్రెగ్నెంట్ చేస్తే రూ.25లక్షలు ఇస్తా అనే ఓ మహిళ వీడియో.. కాంట్రాక్టర్‌ జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ వీడియోలో ఉన్న మహిళ కోసం కాంట్రాక్ట్ ఫోన్ చేయగా.. అక్కడి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో అతడు నిజమని నమ్మాడు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంపర్ ఆఫర్.. ప్రెగ్నెంట్ చేస్తే రూ.25 లక్షలు.. దెబ్బకు టెంప్ట్ అయిన కాంట్రాక్టర్.. చివరకు..
Pune Pregnant Scam
Krishna S
|

Updated on: Nov 01, 2025 | 8:45 PM

Share

పూణేకు చెందిన ఒక కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను చూశాడు. ఆ వీడియోలో ఒక మహిళ గంభీరమైన స్వరంతో.. “నన్ను తల్లిని చేయగల మగాడు కావాలి. అలా చేస్తే రూ.25 లక్షలు ఇస్తాను’’ అని చెప్పింది. మొదట అనుమానం వచ్చినా.. ఆ డబ్బు ఆశతో కాంట్రాక్టర్ వీడియోలో ఉన్న నంబర్‌కు కాల్ చేశాడు. ఫోన్ తీసిన వ్యక్తి తనను తాను..ప్రెగ్నెంట్ జాబ్ కంపెనీ అసిస్టెంట్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ పని కోసం ముందుగా కంపెనీలో రిజిస్టర్ చేసుకోవాలని, అప్పుడే ఐడీ కార్డు, ఇతర డాక్యుమెంట్స్ ఇస్తామని కాంట్రాక్టర్‌కు చెప్పాడు.

ఆ తర్వాతే అసలు మోసం మొదలైంది. మోసగాళ్లు ఒక్కోసారి ఒక్కో సాకు చెబుతూ డబ్బులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు, ఐడీ కార్డు ఛార్జ్, వెరిఫికేషన్, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజు ఇలా ప్రతీదానికి డబ్బులు తీసుకున్నారు. మోసగాళ్ల మాటలు నమ్మిన కాంట్రాక్టర్ సెప్టెంబర్ మొదటి వారం నుండి అక్టోబర్ 23 వరకు 100కి పైగా ఆన్‌లైన్ బదిలీలు చేశాడు. ఈ విధంగా అతను మొత్తం దాదాపు రూ. 11 లక్షలు పంపించాడు. మొదట్లో అంతా బాగుంది.. త్వరలోనే ఆ మహిళతో సెటప్ చేస్తాం అని హామీ ఇచ్చారు. కానీ కాంట్రాక్టర్ అనుమానం వచ్చి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టగానే.. మోసగాళ్లు ఆ నంబర్‌ను బ్లాక్ చేశారు.

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కుంభకోణం

తాను మోసపోయానని గ్రహించిన కాంట్రాక్టర్ బనేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. డబ్బు పంపిన మొబైల్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేస్తున్నారు. ఈ తరహా మోసం పూణేకే పరిమితం కాలేదు. దేశంలోని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల నుండి ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు పోస్ట్ చేసి.. మదర్‌హుడ్ జాబ్ సంస్థ వంటి నకిలీ పేర్లతో అమాయకులను ఆకర్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..