Viral Video: తమ స్కూల్ దుస్థితిని తెలియజేయడం కోసం జర్నలిస్టుగా మారిన స్టూడెంట్.. ప్రభుత్వం స్పందించమని రిక్వెస్ట్

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు విద్యార్ధులు జర్నలిస్టులుగా మారి రోపోర్టింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు తమ పాఠశాల పరిస్థితి గురించి ఓ విద్యార్థి వివరిస్తున్నాడు.

Viral Video: తమ స్కూల్ దుస్థితిని తెలియజేయడం కోసం జర్నలిస్టుగా మారిన స్టూడెంట్.. ప్రభుత్వం స్పందించమని రిక్వెస్ట్
Reporter Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Aug 05, 2022 | 8:59 PM

Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌ కంటెంట్కు కొదవే లేదు. నిత్యం కొన్ని వేల వీడియోలు ఇంటర్నెట్ లో పోస్ట్ అవుతుంటాయి. వీటిలో నవ్వు తెప్పించే వాటితో పాటు ఆశ్చర్యం కలిగించే వీడియోలూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో పాఠశాల విద్యార్థులు జర్నలిస్టులుగా మారి.. రిపోర్టింగ్ చేస్తున్న తీరు నవ్వు తెప్పించినా.. ఆలోచింపచేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు విద్యార్ధులు జర్నలిస్టులుగా మారి రోపోర్టింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు తమ పాఠశాల పరిస్థితి గురించి ఓ విద్యార్థి వివరిస్తున్నాడు. తమ పాఠశాల జరుగుతున్న తీరుని తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.

జార్ఖండ్‌లోని ఒక విద్యార్థి తన పాఠశాల అధ్వాన్న స్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రిపోర్టింగ్‌కు వెళ్లి పాఠశాల పోల్‌ను నిర్వహించాడు. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియోలో.. చిన్న పిల్లవాడు తన తోటివారితో పాటు తన పాఠశాల ప్రాంగణంలో రోజూ ఎదుర్కొంటున్న సమస్యలను బహిర్గతం చేస్తున్నాడు. మాజ్ అఖ్తర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో జార్ఖండ్-బీహార్ సరిహద్దులో ఉన్న గొడ్డా జిల్లాకు చెందినది. ఇక్కడ 6వ తరగతి చదువుతున్న సర్ఫరాజ్ అనే జర్నలిస్ట్ పాత్రను పోషిస్తూ, ప్లాస్టిక్ బాటిల్,  కర్రతో తయారు చేసిన మైక్‌తో రిపోర్టింగ్ చేయడాన్ని చూడవచ్చు. తన తోటి తోటి విద్యార్థులను వారి ఆందోళనలకు సంబంధించి ప్రశ్నలు అడిగాడు. అతను కెమెరా ముందు ఆవరణలో పర్యటన చేస్తూ.. తన పాఠశాల శిథిలావస్థకు చేరుకున్న విధానం చూపించాడు.

మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో తరగతి గదుల్లో ఉపాధ్యాయుడు లేడని బుల్లి జర్నలిస్ట్ కు చెప్పాడు. అంతేకాకుండా పిల్లలు నీళ్లు తాగేందుకు చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని ఏకరవు పెట్టాడు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరాడు. తన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ వీడియో తీసినట్లు సదరు విద్యార్ధి వివరించాడు. నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఈ చిన్నారి నిజమైన జర్నలిజానికి నా హృదయపూర్వక వందనం’ అంటూ వ్యాఖ్యానించారు.  సర్ఫరాజ్ కూడా రిపోర్టర్ స్టైల్‌లో సంతకం చేసి, వీడియో చివర్లో కెమెరామెన్ పేరుతో పాటు తన పేరును కూడా ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్