Internet: భారత్‌లో ఎంతమంది మొబైల్‌ఫోన్‌లో ఇంటర్నేట్ వాడుతున్నారో తెలుసా ?
మొబైల్ ఫోన్ వచ్చాక ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసిన ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ముఖ్యంగా ఇంటర్నెట్ వాడకం వీపరీతంగా పెరిగిపోయింది. ఒక్కరోజు కూడా ఇంటర్నెట్ వాడకుండా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి.
మొబైల్ ఫోన్ వచ్చాక ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసిన ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ముఖ్యంగా ఇంటర్నెట్ వాడకం వీపరీతంగా పెరిగిపోయింది. ఒక్కరోజు కూడా ఇంటర్నెట్ వాడకుండా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మనదేశంలో దాదాపు 75 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు వాడుతున్నారని.. వీళ్లు కనీసం నెలకోసారైన ఇంటర్నేట్‌ను వినియోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అయితే 2025 నాటికి ఇంటర్నెట్ వాడే వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది. అలగే ఆ ఏడాదికి ఇంటర్నెట్ యూజర్లు 56 శాతం గ్రామీణ ప్రాంతాలకే చెందినవారు ఉంటారని తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం 2022లో ఇంటర్నేట్ వాడేవారిలో 39 కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కాగా.. 36 కోట్ల మంది పట్టణ ప్రాంతానికి చెందినట్లు పేర్కొంది. మరో విషయం ఏంటంటే ఇంటర్నేట్ వినియోగించేవారిలో 54 శాతం పురుషులు ఉండడం కొనసాగుతుండగా.. 2022లో మాత్రం 57 శాతం మహిళలే ఉన్నట్లు తేలింది. 2025 నాటికి 65 శాతం మంది మహిళలే ఇంటర్నెట్‌ను ఎక్కువగా వినియోగిస్తారని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..