Police Officer: పోలీసు ఆఫీసర్ దయా హృదయం.. మండుటెండలో బాలుడి అవస్థ చూసి చలించిపోయిన పోలీసు.
ఖాకీలంటే కఠినాత్ములు కాదని, వారికీ హృదయం ఉంటుందని, దానికీ ఎమోషన్స్ ఉంటాయని నిరూపించారు ఓ పోలీస్ ఆఫీసర్. పోలీసుల ఔదార్యం, ఎదుటివారికి వారికి సాయం చేసే గుణం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు గతంలో చూశాం.
నిరుపేద కుటుంబానికి చెందిన ఓ బాలుడు చెప్పులు లేకుండా మండుటెండలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. పై నుంచి ఎండ వేడిమితో రోడ్డుపై అతడి కాళ్లు కాలిపోతున్నాయి. తీవ్ర దాహంతో అల్లాడి పోతున్న ఆ బాలుడిని ఒక పోలీసు అధికారి చూశాడు. ఆ బాలుడి అవస్థ చూసిన ఆ ఖాకీ హృదయం కరిగిపోయింది. వెంటనే సదరు ఆఫీస్ ఆ బాలుడిని ఆపి, మొదట అతనికి వాటర్ బాటిల్ ఇచ్చి నీళ్లు తాగించాడు. బాలుడి భుజాలపై చేయి ప్రేమగా మాట్లాడుతూ ఓదార్చాడు. ఆ తరువాత ఆ బాలుడికోసం కొత్త చెప్పులు కొని, పోలీసు అధికారి స్వయంగా తన చేతులతో ఆ చెప్పులు తొడిగించారు. అంతేకాదు, కొత్త బట్టలు కూడా ఇచ్చారు. తనపై పోలీస్ ఆఫీసర్ చూసిన ఆదరణకు ఆ బాలుడు.. పొంగి పోయాడు. కృతజ్ఞతతో పోలీసు ఆఫీసర్ పాదాలకు నమస్కరిస్తున్నబాలుడిని వారించి, ప్రేమతో ఆశీస్సులు అందించారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను 6 లక్షలమందికి పైగా వీక్షించారు. లక్షమందికి పైగా లైక్ చేశారు. పోలీసు ఆఫీసర్ మంచి మనసుకు కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

