ఇదేం పిచ్చిరా నాయనా.. బైక్‌తో పాటే ఎగిరేసి డాన్సులు
పెళ్లిళ్ల సమయాల్లో ఏ కార్యక్రమాలు లేకున్నా.. డాన్స్ బరాత్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటుంటారు కొందరు. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. కొన్నిసార్లు వధూవరులు కూడా అందరితో పాటు కలిసి స్టెప్పులేస్తుంటారు. ఇక కొందరు లైకులు, వ్యూస్ కోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు.
పెళ్లిళ్ల సమయాల్లో ఏ కార్యక్రమాలు లేకున్నా.. డాన్స్ బరాత్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటుంటారు కొందరు. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. కొన్నిసార్లు వధూవరులు కూడా అందరితో పాటు కలిసి స్టెప్పులేస్తుంటారు. ఇక కొందరు లైకులు, వ్యూస్ కోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బరాత్‌లో యువతీయువకులంతా డీజే పాటలకు డాన్సులతో అదరగొట్టారు. కొందరైతే వరుడిని భుజాల పైకి ఎక్కించుకుని డాన్స్ చేశారు. అదే సమయంలో ఓ యువకుడు బైకుపై అటుగా వచ్చాడు. దీంతో అక్కడున్న యువకులంతా ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు. అత్యుత్సాహంతో యువడితో పాటూ బైకును కూడా పైకి ఎత్తేశారు. అంతటితో ఆగకుండా రౌండ్లు, రౌండ్లు తిప్పి మరీ డాన్సు వేశారు. ఇదేదో బాగుందే… అనుకుంటూ బైకుపై ఉన్న యువకుడు మరింత రెచ్చిపోయి డాన్స్ వేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 అడుగుల ఎత్తు నుండి పడిపోయిన చిన్నారి..చివరికి ??
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువవుతోందని బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రపంచ కుబేరుడు వేసుకున్న ఈ షర్ట్ ఖరీదెంతో తెలుసా ??
ఐదేళ్ల చిన్నారి.. చూస్తుండగానే 95ఏళ్ల వృద్ధురాలిగా మారి..
NTR 30: ఒక పోరాటం ముగించాడు.. వస్తున్నాడు..