AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Apps Ban: కొత్తగా ఆ 54 చైనా యాప్ లు బ్యాన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..

China Apps Ban: చైనా యాప్ ల విషయంలో భారత్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు సెక్యూరిటీ కారణాలు చూపుతూ గత సంవత్సరం జూన్ లో 59, సెప్టెంబర్ లో 118 యాప్ లను బ్యాన్ చేసింది. తాజాగా మరో..

China Apps Ban: కొత్తగా ఆ 54 చైనా యాప్ లు బ్యాన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..
China Apps Ban
Ayyappa Mamidi
|

Updated on: Feb 14, 2022 | 12:18 PM

Share

China Apps Ban: చైనా యాప్ ల విషయంలో భారత్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు సెక్యూరిటీ కారణాలు చూపుతూ గత సంవత్సరం జూన్ లో 59, సెప్టెంబర్ లో 118 యాప్ లను బ్యాన్ చేసింది. తాజాగా మరో సారి 54 చైనాకు చెందిన యాప్ లను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో గల్వాన్ వ్యాలీలో చైనా సైనికుల దురాక్రమణను అడ్డుకునే సమయంలో 20 మంది సైనికులు వీర మరణం పొందిన తరువాత యాప్ లపై చర్యలు చేపట్టింది.

కొత్తగా బ్యాన్ చేసిన వాటిలో స్వీట్ సెల్ఫీ హెచ్ డి, బ్యూటీ కెమెరా- సెల్పీ కెమెరా, ఈక్వలైజర్ బాస్ బూస్టర్, క్యామ్ కార్డ్ ఫర్ సేల్స్ ఫోర్స్ ఈఎన్ టి, ఐసోలాండ్ 2, యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వివో వీడియో ఎడిటర్, టెన్ సెంట్ ఎక్సైవర్, ఓమ్నియోజి ఎరీనా, యాప్ లాక్, డ్యూయల్ స్పేస్ లైట్ యాప్ లు ఉన్నాయి. దేశ భద్రకు ముప్పు ఉన్నందున గతంలో టిక్ టాక్, వి చాట్ వంటి ఫేమస్ యాప్ లను కేంద్రం దేశంలో బ్యాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నందున.. అప్పట్లో బ్యాన్ చేసిన వాటిలో 29 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఇచ్చిన సమాచారం మెరకు బ్యాన్ చేయబడ్డాయి.

కానీ.. భారత్ చేపట్టిన యాప్ ల బహిష్కరణ ప్రపంచ వాణిజ్య సంస్థ చట్టాలకు వ్యతిరేకమని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా యాప్ లపై బ్యాన్ కొనసాగించడంపై భారత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని పలు మార్లు ఇప్పటికే ఆ దేశం సూచించింది.

ఇవీ చదవండి..

Airtel Vs Jio: ఎయిర్ టెల్ కు ధీటుగా జియో.. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవల కోసం ఏం చేసిందంటే..

Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సూచీలు ఎన్ని పాయింట్లు పడ్డాయంటే..

New Property Registration Rules: స్థిరాస్తి క్రయవిక్రయాలకు కొత్త రూల్స్.. ఇకపై అందరూ అది చెల్లించాల్సిందే..