Airtel Vs Jio: ఎయిర్ టెల్ కు ధీటుగా జియో.. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవల కోసం ఏం చేసిందంటే..

టెలికాం కంపెనీ(Telecom companies) మధ్య పోరు రోజురోజుకూ పెరుగుతోంది. కొంతకాలం కిిందట వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎయిర్ టెల్(Airtel) ఒక శాటిలైట్ కంపెనీతో జతకట్టింది. తాజాగా అందుకు ధీటుగా జియో..

Airtel Vs Jio: ఎయిర్ టెల్ కు ధీటుగా జియో.. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవల కోసం ఏం చేసిందంటే..
Jio Joint Venture
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 14, 2022 | 10:18 AM

టెలికాం కంపెనీ(Telecom companies) మధ్య పోరు రోజురోజుకూ పెరుగుతోంది. కొంతకాలం కిిందట వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎయిర్ టెల్(Airtel) ఒక శాటిలైట్ కంపెనీతో జతకట్టింది. తాజాగా అందుకు ధీటుగా జియో(Reliance Jio) సంస్థ కూడా ముందుకు వచ్చింది. దేశంలో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు(Internet) అందించేందుకు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. ఇందుకోసం విదేసీ సంస్థతో జతకట్టింది. భారతదేశంలో SES ఉపగ్రహ డేటా మరియు కనెక్టివిటీ సేవలను అందించడానికి జాయింట్ వెంచర్ ప్రారంభించింది. ఇప్పటికే SES ద్వారా సేవలు పొందుతున్న కొన్ని అంతర్జాతీయ ఏరోనాటికల్ మరియు సముద్ర వినియోగదారులకు జియో సేవలు వర్తించవని తెలుస్తోంది. SES నుంచి 100 Gbps వరకు వేగవంతమైన సేవలు అందుబాటులో ఉండడం వల్ల రిలయన్స్ జియో సంస్థ భారత్ లో మరింత మెరుగైన సేవలు అందిస్తూ.. మార్కెట్ లీడర్ గా ఎదిగనుంది. ఈ సేవలతో ఎక్కువమంది వినియోగదారులను జియో ఆకర్షించే అవకాశం ఉంది. ఈ జాయింట్ వెంచర్ లో జియో స్పేస్ టెక్నాలజీలో జియో ప్లాట్‌ఫారమ్‌లు 51%, SES 49% వాటాను కలిగి ఉంటాయి.

ముకేశ్ అంబానీకి నేతృత్వంలో “పెట్టుబడి ప్రణాళికలో భాగంగా, జాయింట్ వెంచర్ దేశంలో సేవలను అందించడానికి భారతదేశంలో విస్తృతమైన గేట్‌వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. Jio జాయింట్ వెంచర్ యొక్క యాంకర్ కస్టమర్‌గా, కొన్ని మైలురాళ్లతో పాటు గేట్‌వేలు, పరికరాల కొనుగోలుతో పాటు మొత్తం కాంట్రాక్ట్ విలువ సుమారు రూ. 10 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ప్రకటించింది. కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందం వల్ల SES-12, O3b mPOWER, SES తదుపరి తరం MEO కాన్స్టెలేషన్ వల్ల దేశంలో జియో సేవల నెట్ వర్క్ మరింత బలపడనుంది. దీని వల్ల జియో అందిస్తున్న డిజిటల్ సేవలు, అప్లికేషన్లకు వినియోగదారులు మరింత చేరువ అవ్వనున్నారు. జాయింట్ వెంచర్‌ తరఫున దేశంలో సేవలు, గేట్‌వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాల సేవలను జియో అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఇవీ చదవండి..

Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సూచీలు ఎన్ని పాయింట్లు పడ్డాయంటే..

New Property Registration Rules: స్థిరాస్తి క్రయవిక్రయాలకు కొత్త రూల్స్.. ఇకపై అందరూ అది చెల్లించాల్సిందే..