Big Snake : బాప్‌ రే.. 8 అడుగుల పాము కుబుసం.. చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..

Snake Shed Skin: చిన్నపాటి పామును చూస్తేనే హడలిపోతాము. అలాంటిది 7 నుంచి 8 అడుగుల పొడవైన పాము ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తుంటే..

Big Snake : బాప్‌ రే.. 8 అడుగుల పాము కుబుసం.. చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..
Sanke
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 28, 2021 | 4:49 PM

Snake Shed Skin: చిన్నపాటి పామును చూస్తేనే హడలిపోతాము. అలాంటిది 7 నుంచి 8 అడుగుల పొడవైన పాము ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తుంటే.. పరిస్థితి ఎలా ఉంటుంది. గుండె దడ పుట్టాల్సిందే. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ నేలపై పడి ఉన్న పాము కుబుసం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 7.5 అడుగుల పొడవున్న, భయంకరంగా ఉన్న ఈ కుబుసం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాము ప్రమాదకరమా? కాదా? అన్నది పక్కన బెడితే.. పాములు కూడా మనుషులకు దూరంగానే ఉంటాయి. వాటికి జోలికి వచ్చారు.. వాటికి ప్రమాదం ఉంది అని అవి అనుకున్నప్పుడు మాత్రమే వాటి నుంచి మనుషులకు ముప్పు వాటిళ్లుతుందనేది సుస్పష్టం. కాగా, పాము కుబుసం ఫోటోను ట్వీట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి.. పాము తన ఇంట్లో నివసిస్తోందని తెలిపారు.

“ఎవరో బట్టలు మార్చుకున్నారు. ఈ 7.5 అడుగుల ప్రాణి మా ఇంట్లో నివసిస్తుంది. మేము దానిని ఇబ్బంది పెట్టము. ప్రతిగా అది కూడా సామాజిక దూర నిబంధనలను అనుసరిస్తుంది.’’ అని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్వీట్‌కు క్యాప్షన్ పెట్టారు.

పాముల పట్ల అప్రమత్తంగా ఉండాలి కానీ, అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశ్యంతో ఫారెస్ట్ ఆఫీసర్ ఈ ట్వీట్ చేశారు. ప్రకృతి సహజీవనం కోసమేనని, పాములను శాంతియుతంగా జీవించేలా చూడాలని, వాటి జోలికి పోవద్దని సూచించారు. వాస్తవానికి తమ నివాస ప్రాంతాల్లో.. పాము కుబుసం కనిపిస్తే భయపడిపోతుంటారు. పామును వెతికి చంపేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ఎవరూ అలా చేయొద్దని ఫారెస్ట్ అధికారి సూచిస్తున్నారు. ఒకవేళ పాము ఇంటి ఆవరణలో కనిపిస్తే.. దానిని వదిలేయడం గానీ, అటవీ అధికారులకు సమాచారం అందించడం గానీ చేయాలని సూచించారు.

పాము కుబుసం విడిచి పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి.. పాము శరీరంపై కప్పబడి ఉన్న పొర ఎక్స్‌పైర్ అయినప్పుడు. రెండవది.. పాములు తమ శరీరంపై నెలవైన హానీకరమైన పరాన్నజీవులను వదిలించుకోవడానికి చర్మం పొరను తొలగిస్తాయి. అలాగే.. పాము కుబుసం విడిచే సమయంలో నీలం రంగులోకి మారుతుందట. దాని కళ్లు అస్పష్టంగా కనిపిస్తుంటాయట. దాంతో పాము తన దృష్టిని మెరుగు పరుచుకోవడానికి కుబుసాన్ని విడుస్తుంది.

Also read:

Quinton De Kock: “నేను జాత్యాహంకారుడిని కాదు”.. సహచరులకు క్షమాపణలు చెప్పిన క్వింటన్ డి కాక్..

Nagarjuna-CM Jagan: జగన్ నా శ్రేయోభిలాషి.. సీఎంను కలిసిన నాగార్జున..

VIral Video: కోక్‌ గ్లాస్‌లో పిజ్జా..వెరైటీ కాంబినేషన్‌పై నెటిజన్ల విసుర్లు..