VIral Video: కోక్ గ్లాస్‌లో పిజ్జా..వెరైటీ కాంబినేషన్‌పై నెటిజన్ల విసుర్లు..
రెగ్యులర్ వంటకాలను రుచి చూసి విసుగొచ్చిందేమో...ఇటీవల కొందరు వెరైటీ వంటకాలను ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు మీరు ఈ వంటకాలను ట్రై
రెగ్యులర్ వంటకాలను రుచి చూసి విసుగొచ్చిందేమో…ఇటీవల కొందరు వెరైటీ వంటకాలను ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు మీరు ఈ వంటకాలను ట్రై చేయాలంటూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఐస్‌క్రీం దోశ, మ్యాగీ మిల్క్‌షేక్, రసగుల్లాఛాట్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందే. నెటిజన్లు వీటిని చూసి భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొన్ని వంటకాలు బాగున్నాయిని, మరికొన్ని వికారం తెప్పిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అలాంటి మరో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇదేం కాంబినేషన్ రా బాబు.. సాధారణంగా పిజ్జాను తినేటప్పుడు చాలామంది థమ్సప్, పెప్సీ, కోక్ వంటి సాఫ్ట్ డ్రింక్స్‌ను కూడా తీసుకుంటుంటారు. అయితే ఒక అబ్బాయి మాత్రం వింతగా కోక్ గ్లాస్‌లో ముంచి పిజ్జాను తిన్నాడు. పైగా దానిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘పిజ్జా ఇన్ దేశీ స్టైల్’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఇదేం కాంబినేషన్ రా బాబు’, ‘దయచేసి వాడికి పిజ్జా ఆర్డర్ చేయడంపై నిషేధం చేయండి’ అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
Also Read: