గజగజలాడించిన గజరాజు..
వాళ్లు టూరిస్టులు.. అడవిలో అందాల్ని చూసేందుకు వచ్చారు. అడవిలో కనిపించే వాటిని తమ కెమెరాల్లో బంధించాలని ఆశపడ్డారు. కానీ వాళ్ల దృష్టి అడవిలో సైలెంట్‌గా ఉన్న కూృరమృగాల్ని షూట్ చేయాలని సరదానే కొంప ముంచింది. ఉత్తరాఖండ్ అడవిలో వన్యప్రాణులను చూసేందుకు వచ్చిన టూరిస్టులకు ఓ గజరాజు చుక్కలు చూపించాడు. సఫారీగా వెళ్లిన పర్యాటకులు తాము తెచ్చుకున్న వాహనంలో తిరుగుతూ అడవిలోని జంతువుల్ని వీడియో తీశారు. చివరగా భారీ సైజు ఏనుగు కనిపించడంతో దాన్ని వీడియో తీశారు. అప్పటి […]

వాళ్లు టూరిస్టులు.. అడవిలో అందాల్ని చూసేందుకు వచ్చారు. అడవిలో కనిపించే వాటిని తమ కెమెరాల్లో బంధించాలని ఆశపడ్డారు. కానీ వాళ్ల దృష్టి అడవిలో సైలెంట్‌గా ఉన్న కూృరమృగాల్ని షూట్ చేయాలని సరదానే కొంప ముంచింది.
ఉత్తరాఖండ్ అడవిలో వన్యప్రాణులను చూసేందుకు వచ్చిన టూరిస్టులకు ఓ గజరాజు చుక్కలు చూపించాడు. సఫారీగా వెళ్లిన పర్యాటకులు తాము తెచ్చుకున్న వాహనంలో తిరుగుతూ అడవిలోని జంతువుల్ని వీడియో తీశారు. చివరగా భారీ సైజు ఏనుగు కనిపించడంతో దాన్ని వీడియో తీశారు. అప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న గజరాజు టూరిస్టులు కెమెరాలతో సెల్ఫీలు తీసుకోవడంతో కోపం వచ్చిందో.. ఏమో.. కానీ వాళ్లు వెళ్తున్న వాహనాన్ని వెంబడించింది.
ఏనుగు తరుముకొని వస్తుండటంతో భయపడిపోయిన టూరిస్టులు గట్టిగా కేకలు వేస్తూ జీపును వేగంగా పోనిచ్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంనగర్‌లోని సీతాబనీ వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.