Viral Video: క్రేజీ పెళ్లికొడుకు.. అకస్మాత్తుగా వధువు పాదాలకు మొక్కాడు.. ఆమె రియాక్షన్ చూస్తే వావ్ అంటారు
వివాహానికి సంబంధించిన వీడియోలు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తరచూ సర్కులేట్ అవుతున్నాయి. ఈ వీడియోలు కొన్ని చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ, కొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
వివాహానికి సంబంధించిన వీడియోలు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తరచూ సర్కులేట్ అవుతున్నాయి. ఈ వీడియోలు కొన్ని చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ, కొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఇందులో వరుడి ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. నిరంజన్ మోహపాత్రా అనే వ్యక్తి వివాహ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆచార సంప్రదాయాలను బట్టి చూస్తే ఈ వీడియో దక్షిణ భారతానికి చెందినదిగా అర్థం అవుతుంది. వివాహ ఆచారాలు పూర్తి స్థాయిలో జరుగడం వీడియోలో చూడవచ్చు. అతిథుల అందరి మధ్య, వధువు, వరుడు ఒకరికొకరు దండలు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో వధువు తొలుత వరుడి మెడలో దండ వేసి.. అతడి పాదాలకు నమస్కరించింది. అనంతరం వరుడు కూడా వధువు మెడలో దండం వేసి.. ఎవరూ ఊహించని విధంగా ఆమె పాదాలకు నమస్కరించాడు. ఇది చూసిన, అక్కడ ఉన్న అతిథులందరూ నవ్వడం ప్రారంభించారు. ఇలా మొదటిసారి జరగడం చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు.
ఆ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి:
View this post on Instagram
పెళ్లి ఆచారాలకు కొత్త మలుపు ఇవ్వడం ద్వారా, వరుడు అక్కడున్నవారితో పాటు నెటిజన్ల మనసులు కూడా దోచుకున్నాడు. అతడు చేసిన పనితో తొలుత షాకైన వధువు తరువాత చిరునవ్వు చిందించింది. ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. కేవలం షేర్లు చేయడమే కాకుండా తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఎంతైనా క్రేజీ పెళ్లికొడుకు కదా.. మీరేమంటారు.!
Also Read: దొంగతనం చేయడానికి వచ్చాడు.. అనంతలోకాలకు వెళ్లిపోయాడు.. అసలు ఏం జరిగిందంటే